‘మా’ మ్యానిఫెస్టో: సీవీఎల్‌ నరసింహారావు

ABN , First Publish Date - 2021-09-17T00:24:32+05:30 IST

ఈసారి ‘మా’ ఎన్నికల రసవత్తరంగా జరగనున్నాయి. మొదట ప్రకటించినట్లుగా అధ్యక్ష పదవి బరిలో ఐదు మంది లేరు. మహిళా అభ్యర్థులు జీవిత, హేమ వెనకడుగు వేసి ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో చేరారు. ఇప్పుడు అధ్యక్ష పదవికి పోటీ పడేవారిలో ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, సీవీఎల్‌ నరసింహారావు మాత్రమే ఉన్నారు. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌, విష్ణు ప్యానళ్లు విందు, సన్మానాల పేరుతో మంతనాలు జరుపుతున్నారు. సభ్యులతో భేటి అవుతున్నారు.

‘మా’ మ్యానిఫెస్టో: సీవీఎల్‌ నరసింహారావు

అప్పుడు సంకల్పం, చిత్తశుద్ధి కరువైంది 

అదే మ్యానిఫెస్టోను యధాతథంగా 

- సీవీఎల్‌ నరసింహారావు 

ఈసారి ‘మా’ ఎన్నికల రసవత్తరంగా జరగనున్నాయి. మొదట ప్రకటించినట్లుగా అధ్యక్ష పదవి బరిలో ఐదు మంది లేరు. మహిళా అభ్యర్థులు జీవిత, హేమ వెనకడుగు వేసి ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో చేరారు. ఇప్పుడు అధ్యక్ష పదవికి పోటీ పడేవారిలో ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, సీవీఎల్‌ నరసింహారావు మాత్రమే ఉన్నారు. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌, విష్ణు ప్యానళ్లు విందు, సన్మానాల పేరుతో మంతనాలు జరుపుతున్నారు. సభ్యులతో  భేటి అవుతున్నారు. అయితే ఇరువర్గాలు నోటిఫికేషన్‌ వచ్చాకే తమ మ్యానిఫెస్టోను ప్రకటిస్తామని తెలిపారు. మూడో అధ్యక్ష అభ్యర్థి నరసింహారావు నెలరోజులుగా సైలెంట్‌గా ఉండి.. ఇప్పుడు ఒక్కసారిగా తెరమీదకి వచ్చారు. తన మ్యానిఫెస్టోను బయటపెట్టారు. ఈ వివరాలను గురువారం వెల్లడించారు. 


మ్యానిఫెస్టోలో ఆయన పేర్కొన్న అంశాలు...


1. 2011లో ‘మా’ సంక్షేమంగా కోసం కొన్ని రిజల్యూషన్స్‌ అనుకున్నాం. అప్పుడు మురళీమోహన్‌ అధ్యక్ష కుర్చీలో ఉన్నారు. అదే మ్యానిఫెస్టోను యధాతథంగా ఇప్పుడు అమలు చేయాలనుకుంటున్నాం. పాతికేళ్ల తర్వాత వచ్చినవారికి కూడా సంక్షేమ కార్యక్రమాలు చేయాలనే ఆలోచన ముందు నుంచే ఉంది. కాకపోత సంకల్పం, చిత్తశుద్ధి కరువైంది కాబట్టి అదే రిజల్యూషన్స్‌ను అమలు చేయాలనుకుంటున్నాం. 


2. ప్రత్యూష మరణించినప్పుడు జయసుధ ఛైర్‌పర్సన్‌గా ‘ఆసరా’ అనే ఆర్గనైజేషన్‌ ప్రారంభించాం. మీడియాలో ఉండే ఆడవారిపై అత్యాచారాలు, ఇతర ఇబ్బందులు ఎదురైతే అండగా ఉండాలి, ఆడపిలల్ల రక్షణ, ఆత్మ గౌరవం కాపాడటం కోసం ప్రారంభించిన ఈ ఆర్గనైజేషన్‌ను ఇప్పుడు యాక్టివ్‌ చేయాలనుకుంటున్నాం. 


3. తెలంగాణకు సంబంధించి కొంతమంది నటులను మరచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రభాకర్‌రెడ్డి, కాంతారావు, పైడి జయరాజ్‌ వంటి నటులను మళ్లీ మళ్లీ గుర్తు చేయాలని కర్తవ్యంగా పెట్టుకున్నా. 


4. లక్షల్లో మెంబర్‌ షిప్‌ ఉంటే ఎఫ్‌ఎన్‌సీసీలో నామినల్‌ ఫీతో మా సభ్యులకు అసోసియేట్‌ మెంబర్‌షిప్‌ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. 


5. ‘మా’లో సభ్యత్వం లేని ఆర్టిస్‌లు సినిమాల్లో యాక్ట్‌ చేస్తే... ఆ చిత్ర నిర్మాత మెంబర్‌షిప్‌ కట్టి వారిని సభ్యులుగా చేయాలనే నియమం పెట్టాలనుకుంటున్నాం. 


6. ఓటింగ్‌ విధానంలో కూడా మార్పు చేయాలని అనుకుంటున్నాం. 


7. ఫండ్‌ రైజింగ్‌ ఈవెంట్‌లకు విదేశాలకు వెళ్లేటప్పుడు ఫేస్‌ వాల్యూ ఉన్న పాతిక మందే కాకుండా చిన్న స్థాయి ఆర్టిస్ట్‌లను కూడా విదేశాలకు తీసుకెళ్లే అవకాశం ఇవ్వాలని కోరిక. 


8. సమాజం పాడవ్వడానికి సినిమాలే కారణం అనే అపవాదు తరచూ వినిపిస్తోంది. డ్రగ్స్‌, వైలెన్స్‌ లాంటి సన్నివేశాలను మోతాదుకి మించి చిత్రాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఆ అపవాదును తొలగించవచ్చు. 


Updated Date - 2021-09-17T00:24:32+05:30 IST