టీజర్‌పై విమర్శలు

ABN , First Publish Date - 2022-10-05T07:12:27+05:30 IST

రామాయణ గాథ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ‘ఆదిపురుష్‌’ చిత్రాన్ని ఇప్పుడు వివాదాలు చుట్టుముట్టాయి....

టీజర్‌పై విమర్శలు

రామాయణ గాథ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ‘ఆదిపురుష్‌’ చిత్రాన్ని ఇప్పుడు వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమాతో ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా, సైఫ్‌ అలీఖాన్‌ రావణుడిగా నటించారు. ఎప్పుడో షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషనల్‌ వర్క్‌ను గాంధీ జయంతి రోజున ప్రారంభించారు. రామజన్మభూమిగా ప్రసిద్ధి చెందిన అయోధ్యలో చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. రిలీజ్‌ చేసిన గంటల వ్యవధిలోనే ఈ టీజర్‌ చాలా మందికి రీచ్‌ అయింది. ఇక అప్పటినుంచి దీనిపై మిశ్రమ స్పందన మొదలైంది. ముఖ్యంగా రావణాసురుడి గెటప్‌, హనుమంతుడి గెటప్‌ లపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా తాజాగా స్పందిస్తూ ‘టీజర్‌ చూశాను. అందులో కొన్ని షాట్స్‌ అభ్యంతరకరంగా ఉన్నాయి. ముఖ్యంగా హనుమంతుడు వేసుకున్న డ్రస్‌ దారుణంగా ఉంది. హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్న ఆ సన్నివేశాలను తొలగించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’ అని దర్శకుడు ఓర రౌత్‌ను హెచ్చరించారు. రావణుడిగా నటించిన సైఫ్‌ గెటప్‌ పై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ‘ఆదిపురుష్‌’ చిత్రంలోని వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ గురించి రకరకాల కామెంట్స్‌ వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం తాము పనిచేయలేదనీ ప్రముఖ వీఎఫ్‌ఎక్స్‌ సంస్థ ఎన్‌వై వీఎఫ్‌ఎక్స్‌ వాలా ఓ ప్రకటన విడుదల చేసింది. చిత్రంలోని సీజీ , ఇతర స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ తాము చేయలేదని స్పష్టం చేసింది.

Updated Date - 2022-10-05T07:12:27+05:30 IST