Video Viral: ఊ అంటావా.. ఊఊ అంటావా అంటున్న విరాట్ కోహ్లి.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

ABN , First Publish Date - 2022-04-29T16:34:24+05:30 IST

రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగుళూరు క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్, భారతీయురాలు వినీ రమణి వివాహం గత నెల ఆస్ట్రేలియాలోని..

Video Viral: ఊ అంటావా.. ఊఊ అంటావా అంటున్న విరాట్ కోహ్లి.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగుళూరు క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్, భారతీయురాలు వినీ రమణి వివాహం గత నెల ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగింది. గత కొన్నేళ్లుగా డేటింగ్‌‌లో ఉన్న ఈ కపుల్ మ్యారేజ్ తమిళ సంప్రదాయం ప్రకారం జరిగింది. వారి పెళ్లి తర్వాత ఐపీఎల్ 2022 ప్రారంభమైంది. ఈ తరుణంలో ఇక్కడికి వచ్చిన మాక్స్‌వెల్ దంపతులు క్రికెటర్స్‌కి పార్టీ ఇచ్చారు.


ఆ పార్టీకి ఎంతోమంది క్రికెటర్స్ భార్యలతో సహా హాజరయ్యారు. వారిలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట కూడా ఉంది. ఆ పార్టీలో భాగంగా క్రికెటర్స్ అందరూ డ్యాన్సులతో అదరగొట్టారు. అందులో.. ‘పుష్ప’ సినిమాలోని అల్లు అర్జున్, సమంత స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ పాటకి విరాట్, ఇతర క్రికెటర్లతో కలిసి డ్యాన్స్ వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో విరాట్ డ్యాన్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కొందరూ ‘సూపర్ డ్యాన్సర్’, ‘నిజమైన డ్యాన్సర్‌ల చేశావు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వైరల్ వీడియోని మీరు ఓ సారి చూసేయండి..



Updated Date - 2022-04-29T16:34:24+05:30 IST