Bollywood: సంజయ్ లీలా భన్సాలీ క్రేజీ మల్టీస్టారర్..!

ABN , First Publish Date - 2022-09-29T01:05:16+05:30 IST

బాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్స్‌లో సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ఒకరు. బీ టౌన్‌లో భారీ తరహా సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. ‘దేవదాస్’ (Devdas), ‘రామ్ లీలా’ (Ram Leela)

Bollywood: సంజయ్ లీలా భన్సాలీ క్రేజీ మల్టీస్టారర్..!

బాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్స్‌లో సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ఒకరు. బీ టౌన్‌లో భారీ తరహా సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. ‘దేవదాస్’ (Devdas), ‘రామ్ లీలా’ (Ram Leela), ‘బాజీరావ్ మస్తానీ’ (Bajirao Mastani) వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ‘హీరా మండీ’ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాడు. అనంతరం మ్యూజికల్ డ్రామా ‘బైజు బావ్రా’ ను (Baiju Bawra) ను పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలు నటించనున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ప్రస్తుతం మేకర్స్ వారితో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.


‘బైజు బావ్రా’ లోకి బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)లను తీసుకోవాలని భన్సాలీ ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం వారితో చర్చలు జరుపుతున్నారని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. రణ్‌బీర్ తొలి సినిమా ‘సావారియా’ (Saawariya) ను సంజయ్ లీలా భన్సాలీనే తెరకెక్కించాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతన్నప్పుడు వీరిద్దరి మధ్య అనేక విభేదాలు తలెత్తాయి. అందువల్ల వీరిద్దరు మరోసారి కలసి పనిచేయకూడదని నిర్ణయించుకున్నారు. అయినప్పటికి, భన్సాలీ ఈ కథకు రణ్‌బీర్ అయితే సరిగ్గా సరిపోతాడని భావించాడట. అతడితో చర్చలు జరిపాడట. ఆలియా కూడా విబేధాలు మర్చిపోవాలని రణ్‌బీర్‌కు చెప్పిందట. కానీ, రణ్‌బీర్ మాత్రం తన అంగీకారాన్ని తెలపలేదని తెలుస్తోంది. గతాన్ని మర్చిపోయి రణ్‌బీర్ ఈ సినిమాను అంగీకరిస్తాడా లేదా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. విజయ్ భట్ రాసిన ‘బైజు బావ్రా’ నవలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు ఛాన్స్ ఉందని తెలుస్తోంది. రణ్‌వీర్‌కు జోడీగా ఆలియా భట్ నటించనుంది. మరో హీరోయిన్ పాత్ర కోసం కియారా అడ్వాణీ(Kiara Advani) తో మేకర్స్ చర్చలు జరుపుతున్నారట. ఆమె కూడా తన అంగీకారాన్ని తెలపలేదని తెలుస్తోంది.



Updated Date - 2022-09-29T01:05:16+05:30 IST