నా భార్యతో కలిసి ఉండలేను.. విడాకులు కావాల్సిందే.. కోర్టుకు తేల్చిచెప్పిన ప్రముఖ నటుడు.. ఆమె బయటపెట్టిన షాకింగ్ నిజాలివి..!

ABN , First Publish Date - 2022-05-27T15:07:02+05:30 IST

విడాకుల కేసులో భోజ్‌పూర్‌లోని అరా కోర్టు భోజ్‌పురి సూపర్‌స్టార్‌ పవన్‌సింగ్‌, జ్యోతిసింగ్‌కి చివరి అవకాశం ఇచ్చింది...

నా భార్యతో కలిసి ఉండలేను.. విడాకులు కావాల్సిందే.. కోర్టుకు తేల్చిచెప్పిన ప్రముఖ నటుడు.. ఆమె బయటపెట్టిన షాకింగ్ నిజాలివి..!

విడాకుల కేసులో భోజ్‌పూర్‌లోని అరా ఫ్యామిలీ కోర్టు భోజ్‌పురి సూపర్‌స్టార్‌ పవన్‌సింగ్‌, జ్యోతిసింగ్‌కి చివరి అవకాశం ఇచ్చింది. గతేడాది అక్టోబర్ 9న పవన్ వేసిన విడాకుల పిటిషన్‌ని మే 26న విచారించిన ఫ్యామిలీ కోర్టు కేసును వాయిదా వేస్తూ తదుపరి విచారణలో పరస్పర ఒప్పందంతో విడాకులు తీసుకోవాలని సూచించింది. అంతకుముందు పవన్ సింగ్ మాట్లాడుతూ.. ‘నాకు నా భార్యతో కలిసి జీవించడం ఇష్టం లేదు. విడాకులు కావాలి’ అని చెప్పుకొచ్చాడు. దీంతో భార్య జ్యోతిసింగ్ కూడా పవన్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది.


పవన్ సింగ్ తరపు న్యాయవాది సుదామా సింగ్ ఆ ఇద్దరికీ భార్యాభర్తలుగా జీవించడం ఇష్టం లేదని కోర్టు చెప్పారు. అనంతరం అదే విషయాన్ని ఇద్దరూ కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని పేర్కొంది. దానికోసం వారికి చివరి అవకాశం ఇస్తూ విచారణని వాయిదా వేశారు. తరువాత హియరింగ్‌లో పరస్పర అంగీకారంతో ఇద్దరూ వన్ టైమ్ సెటిల్మెంట్ విడాకులు తీసుకోవాలని సూచించారు.


జ్యోతిసింగ్ తరఫు న్యాయవాది విష్ణుధర్ పాండే మాట్లాడుతూ.. ‘పవన్ సింగ్ జ్యోతికి రెండుసార్లు అబార్షన్ చేయించారు. పెళ్లయిన తర్వాత నిత్యం భార్యను కొట్టడంతోపాటు చిత్రహింసలు పెట్టేవాడు. చాలాసార్లు ఇబ్బందులకి గురి చేశాడు. అది తట్టుకోలేక గత కొన్ని నెలలుగా జ్యోతి సింగ్ తన తల్లి ఇంట్లోనే ఉంటోంది. కాబట్టి పవన్ సింగ్‌తో విడాకులతో పాటు మధ్యంతర భరణం కూడా ఇప్పించాలి’ అని కోర్టును కోరారు.


కాగా.. పవన్ సింగ్ మొదటి భార్య నీలం సింగ్ మనస్పర్థల కారణంగా మార్చి 8, 2015న ముంబైలోని ఒక ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకుంది. కొన్ని రోజుల అనంతరం, పవన్ సింగ్ ప్రసిద్ధ భోజ్‌పురి నటి అక్షరా సింగ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన జ్యోతి సింగ్‌ను 7 మార్చి 2018న వివాహం చేసుకుని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే పవన్ రెండో పెళ్లి సైతం ఎంతో కాలం నిలవలేదు. నిజానికి.. ఈ విచారణ ఏప్రిల్ 28నే జరగాల్సింది. కానీ.. వివిధ కారణాల వల్ల పవన్ సింగ్ కోర్టుకు హాజరు కాకపోవడంతో మే 26న పోస్ట్‌పోన్ అయ్యింది.

Updated Date - 2022-05-27T15:07:02+05:30 IST