‘పుష్ప’ ఐటమ్‌సాంగ్‌కు సెగ.. ‘తగ్గేదే లే’ అంటోన్న పురుషుల సంఘం

ABN , First Publish Date - 2021-12-16T21:38:03+05:30 IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, దర్శకుడు కె.సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కి ఈనెల 17వ తేదీన విడుదల కానున్న ‘పుష్ప’ చిత్రంలోని ఐటమ్‌సాంగ్‌ ఇప్పుడు తమిళంలోనూ వివాదం రేపింది. ఈ పాటను తొలగించకుంటే పాటకు డ్యాన్స్‌ చేసిన

‘పుష్ప’ ఐటమ్‌సాంగ్‌కు సెగ.. ‘తగ్గేదే లే’ అంటోన్న పురుషుల సంఘం

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, దర్శకుడు కె.సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కి ఈనెల 17వ తేదీన విడుదల కానున్న ‘పుష్ప’ చిత్రంలోని ఐటమ్‌సాంగ్‌ ఇప్పుడు తమిళంలోనూ వివాదం రేపింది. ఈ పాటను తొలగించకుంటే పాటకు డ్యాన్స్‌ చేసిన సమంత, పాట పాడిన ఆండ్రియా, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌, గేయరచయిత వివేకాపై కేసు పెడతామని రాష్ట్రంలోని పురుషుల సంఘం హెచ్చరించింది. ఈ చిత్రంలో సమంత ఐటమ్‌ గర్ల్‌గా నర్తిస్తూ సాగే పాట ‘ఓ సొల్‌రియా...’ అనే పాట తమిళంలోనూ సూపర్‌ హిట్‌ అయింది. ఈ పాటను తెలుగులో చంద్రబోస్‌ రాయగా, తమిళంలో గేయరచయిత వివేకా రాశారు. ఇటీవల ఈ పాట లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేయగా సూపర్‌డూపర్‌ హిట్‌ సాధించింది. 


అయితే, ఈ ఐటమ్‌ సాంగ్‌ తెలుగులో ఇప్పటికే వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో తమిళంలోనూ ఇది హిట్‌ కావడంతో పాటు వివాదాన్ని కూడా రేపింది. తమిళంలో ఈ పాటను ఆండ్రియా ఆలపించారు. ఇప్పటికే 20 మిలియన్‌ పైగా వ్యూస్‌ వచ్చాయి. అయితే, ఈ పాటలో ఉన్న పదాలు పురుష సమాజాన్ని మొత్తం కించపరిచేలా వుందని, అందుకే ఈ పాటను బ్యాన్‌ చేయాలని.. లేదంటే పోరాటంలో ‘తగ్గేదే లే’ అని తమిళనాడులోని పురుషుల సంఘం డిమాండ్‌ చేస్తోంది.  కాగా, ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఐదు భాషల్లో హిట్‌ కావడం గమనార్హం.



Updated Date - 2021-12-16T21:38:03+05:30 IST