ట్రబుల్స్‌లో విక్కీ కౌశల్ సినిమా.. ఆ నెంబర్ నాదంటూ కేసు నమోదు

ABN , First Publish Date - 2022-01-02T17:31:57+05:30 IST

బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్, బ్యూటిఫుల్ సారా అలీఖాన్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రస్తుత షెడ్యూల్ మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో సాగుతోంది...

ట్రబుల్స్‌లో విక్కీ కౌశల్ సినిమా.. ఆ నెంబర్ నాదంటూ కేసు నమోదు

బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్, బ్యూటిఫుల్ సారా అలీఖాన్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రస్తుత షెడ్యూల్ మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో సాగుతోంది. ఇందులో భాగంగా హీరోహీరోయిన్లపై ఓ యాక్షన్ సిక్వెన్స్ తీస్తోంది చిత్ర బృందం. 


ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. అయితే అందులో విక్కీ, సారా ఓ బైక్ ప్రయాణిస్తూ ఉంటారు. దానికి ఉన్న నెంబర్ ప్లేట్ తనది అంటూ ఇండోర్ వాసి జై సింగ్ యాదవ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైట్ ఫైల్ చేశాడు.


ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సినిమాలో ఓ సీన్‌లో ఉపయోగించిన బైక్‌కి ఉన్న నెంబర్ ప్లేట్ నాది. దీనికి గురించి చిత్ర బృందానికి తెలుసో లేదో నాకైతే తెలియదు కానీ ఇది మాత్రం చట్టబద్ధం కాదు. నా అనుమతి లేకుండా వారు దానిని ఉపయోగించకూడదు. దీని గురించి స్టేషన్‌లో కంప్లైట్ ఇచ్చాను. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల’ని తెలిపాడు. అంతేకాకుండా వాటి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో షేర్ చేశాడు.


ఈ కంప్లైంట్ గురించి ఎస్‌ఐ రాజేంద్ర సింగ్ సోనీ మాట్లాడుతూ.. ‘మాకు దీనిపై కంప్లైంట్ వచ్చింది. నెంబర్ ప్లేట్‌ని ఇల్లీగల్‌గా వాడారో లేదో విచారిస్తాం. అనంతరం నిజమని తెలితే మోటర్ వెహికిల్ చట్టం కింద చర్యలు తీసుకుంటాం. చిత్ర యూనిట్ ఇండోర్‌లోనే ఉంటే వారిని కలిసి సమాచారం తెలుసుకుంటామ’ని చెప్పారు.



Updated Date - 2022-01-02T17:31:57+05:30 IST