Viral Video: ‘టామ్ అండ్ జెర్రీ’... ‘పుష్ప’... సేమ్ టూ సేమ్... తగ్గేదేలే!

ABN , First Publish Date - 2022-02-22T22:19:57+05:30 IST

‘ఆర్య, ఆర్య 2’ తర్వాత టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్, స్టార్ హీరో అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘పుష్ప: ది రైజ్’...

Viral Video: ‘టామ్ అండ్ జెర్రీ’... ‘పుష్ప’... సేమ్ టూ సేమ్... తగ్గేదేలే!

‘ఆర్య, ఆర్య 2’ తర్వాత టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్, స్టార్ హీరో అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘పుష్ప: ది రైజ్’. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్‌ అయింది. దీంతో దేశీయ సెలబ్రిటీల నుంచి అంతర్జాతీయ సెలబ్రిటీల వరకు ఈ సినిమాకి ఫిదా అయిపోయి వరుసగా రీల్స్ చేశారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ వీడియో హల్‌చల్ చేస్తోంది. అది పాపులర్ కామిక్ సిరీస్ ‘టామ్ అండ్ జెర్రీ‘లోని సీన్లతో ఈ సినిమా సీన్లను పోలుస్తోన్న వీడియో.


ఇప్పటికే ఇలాంటి వీడియోలు ఎన్నో వచ్చినప్పటికీ ఈ వీడియో మాత్రం అందరి దృష్టి‌ని ఆకర్షించింది. ఆ వీడియోలో పుష్ప సినిమాలోని ‘సామి సామి’ పాట డ్యాన్స్, విలన్ హీరోని గన్ పెట్టి బెదిరించడం, శ్రీవల్లీ సాంగ్‌లోని ఫేమస్ స్టెప్, హీరో గొడ్డలిని స్టైల్‌గా తిప్పడం వంటి పలు సీన్లు ఉన్నాయి. వాటిని టామ్ అండ్ జెర్రీలోని సీన్లతో పోలుస్తూ వీడియో చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి..



Updated Date - 2022-02-22T22:19:57+05:30 IST