Liger: ఆ కటౌట్‌పై అవేం కామెంట్లురా నాయన!

ABN , First Publish Date - 2022-07-21T04:08:58+05:30 IST

ఇంకొన్ని గంటల్లో ‘లైగర్’ (Liger) ట్రైలర్ సునామి మొదలవ్వబోతోండగా.. ఈ ట్రైలర్‌ విడుదలకు సంబంధించి హైదరాబాద్ ఆర్‌టీసి క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 35 ఎమ్ఎమ్ థియేటర్‌ వద్ద ఏర్పాటు చేసిన విజయ్ దేవరకొండ

Liger: ఆ కటౌట్‌పై అవేం కామెంట్లురా నాయన!

ఇంకొన్ని గంటల్లో ‘లైగర్’ (Liger) ట్రైలర్ సునామి మొదలవ్వబోతోండగా.. ఈ ట్రైలర్‌ విడుదలకు సంబంధించి హైదరాబాద్ ఆర్‌టీసి క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 35 ఎమ్ఎమ్ థియేటర్‌ వద్ద ఏర్పాటు చేసిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కటౌట్ ఇప్పుడు వార్తలలో హైలెట్ అవుతోంది. కేవలం ట్రైలర్ విడుదలకే దాదాపు 75 అడుగుల కటౌట్‌ను విజయ్ దేవరకొండ అభిమానులు ఏర్పాటు చేయడంతో.. ఇక సినిమా విడుదల టైమ్‌కి ఏ రేంజ్‌లో విజయ్ క్రేజ్ ఉండబోతోందో అంటూ.. ఈ కటౌట్‌పై టాక్ నడుస్తుంది. అయితే ఈ కటౌట్‌లో విజయ్ దేవరకొండ కనిపించిన విధానంపై ఇప్పుడు హాట్‌హాట్‌గా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ జాతీయ పతాకాన్ని చేతబూని.. ఉన్న ఈ కటౌట్‌లో  బాక్సర్‌ అవతారంలో ఆయన అర్థనగ్నంగా కనిపించారు. అంతకుముందు ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయ్‌కి చెందిన ఓ న్యూడ్ స్టిల్‌ని విడుదల చేసి మేకర్స్ హడావుడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడా ఫొటోని, ఈ కటౌట్‌ని ఒకచోటకి చేర్చి.. కొందరు నెటిజన్లు చేసే కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. వారు చేసే కామెంట్స్ చూస్తే.. ‘ఆ కటౌట్‌పై అవేం కామెంట్లురా నాయన!’ అని అంతా అనుకోవాల్సిందే. 


ఇంకో విషయం ఏమిటంటే.. కొందరు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా ఈ కటౌట్స్‌పై నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ‘‘అసలు లైగర్ టీమ్ ఏం చెప్పాలని అనుకుంటుంది? ఇప్పటికే సినిమాకి కావాల్సిన హైప్ వచ్చేసింది. ఈ విధమైన పోస్టర్స్‌తో పబ్లిక్ అటెన్షన్‌ని పొందాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండకు గొప్ప భవిష్యత్ ఉంది.. పూరి నిరుత్సాహపరచరని అనుకుంటున్నాం..’’ అని విజయ్ ఫ్యాన్స్ కొందరు కామెంట్ చేశారు. 


ఇక సుదర్శన్ 35 ఎమ్ఎమ్ థియేటర్‌ వద్ద ఏర్పాటు చేసిన కటౌట్‌ని పూరి కనెక్ట్స్ ట్విట్టర్‌లో ట్వీట్ చేయగా..ఆ ట్వీట్‌కు 

‘ఇంకేం పిక్ దొరకలేదా’, ‘కాస్త మంచి పిక్ తీసుకోవచ్చుగా’, ‘కట్ డ్రాయర్ యాడ్‌లా ఉంది’, ‘అర్జెంట్‌గా ఆ పిక్ డిలీట్ చెయ్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే.. ఈ కటౌట్‌కు పంచె, బనియన్‌, నెత్తిన ఓ తలపాగ పెట్టి.. ‘సౌత్‌ ఇండియా లైగర్‌’ అంటూ.. ఆ ఫొటోని వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇన్‌స్టాగ్రమ్‌లో మాత్రం ఈ కటౌట్ బాగా వైరల్ అవుతోంది. విజయ్ అభిమానులు ఈ కటౌట్‌ని ఇన్‌స్టాలో వైరల్ చేస్తున్నారు. మొత్తానికి ట్రైలర్ విడుదల కంటే ముందే.. ఒక్క కటౌట్‌తో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా అటెన్షన్‌ను రాబట్టారన్నది మాత్రం నిజం. కాగా, జూలై 21 ఉదయం 9గంటల 30 నిమిషాలకు ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేయనున్నారు.  హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్టు 25న  ప్రపంచవ్యాప్తంగా భారీగా థియేటర్లలో విడుదల కానుంది.    







Updated Date - 2022-07-21T04:08:58+05:30 IST