Liger : అలాంటి లెజెండ్‌కు ఇలాంటి పాత్ర?

ABN , First Publish Date - 2022-08-26T16:46:08+05:30 IST

ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో మైక్ టైసన్ (Mike Tyson) లెజెండ్. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ అతడు. ఈ రికార్డు మరెవరికీ లేదు. WBA, WBC, IBF టైటిల్స్ అందుకున్న మొట్టమొదటి హెవీవెయిట్ బాక్సర్.

Liger : అలాంటి లెజెండ్‌కు ఇలాంటి పాత్ర?

ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో మైక్ టైసన్ (Mike Tyson) లెజెండ్. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ అతడు. ఈ రికార్డు మరెవరికీ లేదు. WBA, WBC, IBF టైటిల్స్ అందుకున్న మొట్టమొదటి హెవీవెయిట్ బాక్సర్. అలాంటి మైక్ టైసన్ తన ఒరిజినల్ పాత్రతో పలు హాలీవుడ్ మూవీస్ లో నటించాడు. వాటిలో ముఖ్యంగా చైనీస్ సూపర్ హిట్ సిరీస్ ‘ఐపీ మేన్ 3’ (IP Man 3) లో ఐపీ మేన్‌తో తలపడే సన్నివేశంలో అద్భుతంగా నటించి మెప్పించాడు.  అంతటి పేరు ప్రఖ్యాతులున్న మైక్ టైసన్ ను ‘లైగర్’ (Liger) మూవీలో పూరీ జగన్నాథ్ సరిగ్గా వాడుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ‘లైగర్’ సినిమాలో మైక్ టైసన్ నటిస్తున్నాడనే సరికి సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. ఆయన నటించే తొలి ఇండియన్ సినిమా అనే ఘనత కూడా తోడైంది. అది తెలుగు సినిమాకు దక్కిన గౌరవంగా భావించారు.


‘లైగర్’ ట్రైలర్‌లో ‘ఇఫ్ యువారే ఫైటర్.. దెన్ హూ యామై’ (If You are a fighter .. then who am I? )అనే టైసన్ డైలాగ్‌తో ఎంతో ఆసక్తి రేగింది. సినిమా పోస్టర్స్ లోనూ టైసన్ ను చూసి ఎంతో ఎగ్జైట్ అయ్యారు ప్రేక్షకులు. సినిమా మీద అంచనాలు పెరగడానికి టైసన్ కూడా ఓ కారణమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కట్ చేస్తే సినిమాలో ఆయన్ను ప్రెజెంట్ చేసిన తీరుకు ప్రేక్షకుల మైండ్ బ్లాక్ అయిపోయింది. టైసన్, విజయ్ లను తండ్రీకొడుకులుగా చూపించి.. ‘సాలా క్రాస్‌బ్రీడ్’ అనే ట్యాగ్ లైన్ కు న్యాయం చేస్తారేమో.. ఆ ఇద్దరూ రింగ్ లో నువ్వా నేనా అంటూ తలపడుతూ.. మంచి ఎమోషన్స్ ను వర్కవుట్ చేస్తారేమో అని ఆశించిన ప్రేక్షకులకు ఆశాభంగం తప్పలేదు. సినిమాలో ఆయన్నో చిల్లర విలన్ ను చేయడం ఆడియన్స్ ఏమాత్రం జీర్ణించుకోలేని విషయం. హీరోయిన్ ను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసే పాత్ర ఆయనది. హీరో ఆయనతో ఫైట్ చేసి కిందపడేసి మరీ హీరోయిన్ ను తెచ్చుకుంటాడు. అది చూడ్డానికి మరీ కామెడీ అనిపిస్తుంది. 


‘లైగర్’ సినిమా క్లైమాక్స్ లో విజయ్ కు మైక్ టైసన్ తో పోరు ఉంటుందని అందరూ ఊహించారు. సినిమాలో కూడా అదే జరిగింది. కాకపోతే  అదే మైనస్ గా మారింది. సినిమాపై అప్పటికే తగ్గిన ఇంప్రెషన్ కూడా పోగొట్టి ప్రేక్షకులకు చికాకు తెప్పించింది. అంత పెద్ద లెజెండ్ ను పూరీ ఇంత కామెడీగా వాడుకున్నాడేంటి? అని ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతైంది. అసలు  ఈ పాత్రకు టైసన్ ఎలా ఒప్పుకున్నాడన్నది ప్రేక్షకులకు అర్ధం కాని ప్రశ్నైంది. 

Updated Date - 2022-08-26T16:46:08+05:30 IST