ఆ సినిమా తర్వాత NTR కాళ్లమీద పడిపోయా: 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ

ABN , First Publish Date - 2022-06-28T02:43:11+05:30 IST

నా లైఫ్‌కి నేను చేసిన ఆ పాత్ర అండమాన్ జైలు అవుతుందని అస్సలు అనుకోలేదు అన్నారు..’’ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ. తాజాగా ఆయన ABN ఆంధ్రజ్యోతి ఛానల్‌లో ప్రసారమయ్యే ‘Open Heart with RK’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన..

ఆ సినిమా తర్వాత NTR కాళ్లమీద పడిపోయా: 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ

‘‘నా లైఫ్‌కి నేను చేసిన ఆ పాత్ర అండమాన్ జైలు అవుతుందని అస్సలు అనుకోలేదు అన్నారు..’’ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ. తాజాగా ఆయన ABN ఆంధ్రజ్యోతి ఛానల్‌లో ప్రసారమయ్యే ‘Open Heart with RK’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వృత్తి, వ్యక్తిగత, రాజకీయ విషయాలకు సంబంధించి ఓపెన్ అయ్యారు. అందులో ఆయన నటించిన ‘గండిపేట రహస్యం’ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.


‘‘గండిపేట రహస్యం’’ చిత్రం విషయంలో జరిగిన విషయాన్ని తెలుపుతూ.. ‘‘అనవసరంగా ఆ సినిమాలో చిక్కుల్లో పడ్డాను. పద్మాలయా స్టూడియోలో ఒక సినిమా చేస్తున్నామన్నారు. నేనేదో చిన్న క్యారెక్టర్‌ అనుకున్నాను. వెళ్లాక ‘నువ్వు రామారావుగారి వేషం వేయాలి’ అన్నారు. పక్కన ఉన్నవాళ్ళు ‘నువ్వు వెయ్యకపోయినా వేరేవాళ్ళు వేస్తారు. వాళ్ళకి పేరొస్తుంది. నువ్వు చెయ్యాలి’ అన్నారు. అది ‘గండిపేట రహస్యం’ సినిమా. కొంచెం ప్యాడింగ్‌ అవీ పెట్టి చేయించారు. నా లైఫ్‌కి అది అండమాన్‌ జైలు అవుతుందని నేననుకోలేదు. పద్మాలయా స్టూడియోలోంచి బయటికి రాలేం, లోపలికి వెళ్ళలేం. ‘ఏంటండీ ఇలా చేశారు?’ అన్నాను.


నాకు మొదట ఏమీ తెలీదు. ఏదో చేసేశాను. చేసిన తరువాత... పెద్దాయనను ప్రసాద్‌ ల్యాబ్‌లో కలిసి కాళ్ళకు దండం పెట్టాను. క్యారెక్టర్‌ ఇలా ఇచ్చారని చెప్పాను. ‘ఎప్పుడూ అలాంటివి చెయ్యకండి మీరు’ అన్నారాయన. నాకు నిజంగా ఆయన దేవుడనిపించింది. 


ఆ దెబ్బతో నన్ను బ్యాన్ చేస్తారని అనుకున్నాను కానీ.. ఇండస్ట్రీలో బ్యాన్ చేయలేదు. బయట తెలుగుదేశం మామూలుగా లేదు. ఎన్టీఆర్‌ నాకు బొట్టు పెట్టి, పది రూపాయల కాగితం మీద ‘గౌరవనీయులు తమ్ముడికి అభినందనలతో, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి’ అని రాసి ఇచ్చారు. అలా ఇచ్చే సమయానికి ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ పదిరూపాయలు ఫ్రేమ్‌ కట్టించాను. ఆయన, నేను దిగిన పెద్ద ఫొటో కూడా తాడేపల్లిగూడెంలో ఇప్పటికీ ఉంది..’’ అని పృథ్వీ చెప్పుకొచ్చారు. 

Updated Date - 2022-06-28T02:43:11+05:30 IST