Comedian Ali: అలీ షాకింగ్ నిర్ణయం తీసుకుంటున్నాడా?

ABN , First Publish Date - 2022-09-29T00:23:40+05:30 IST

కమెడియన్ అలీ (Comedian Ali) రాజకీయ పరిస్థితి (Political situation) అడకత్తెరలో వేసిన పోక చెక్కలా తయారయింది.

Comedian Ali: అలీ షాకింగ్ నిర్ణయం తీసుకుంటున్నాడా?

కమెడియన్ అలీ (Comedian Ali) రాజకీయ పరిస్థితి (Political situation) అడకత్తెరలో వేసిన పోక చెక్కలా తయారయింది. గత ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) సీట్ ఇవ్వలేదని జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) సమక్షం లో  వై ఎస్ ఆర్ సి పి (YSRCP) లో చేరి ఆ పార్టీ కి ప్రచారం (political campaign) కూడా చేసాడు. జగన్ ఎదో ఇస్తాను అని ప్రామిస్ చేసుకున్నాకే పార్టీ లో చేరాడని అప్పుడు అందరూ అనుకున్నారు. అలీ కూడా ఏదైనా మంచి పదవి వస్తుందని ఆశించాడు. రాజ్యసభ (Rajya Sabha) కి అయినా ఎంపిక చేస్తారని అనుకున్నాడు, కానీ ఇంతవరకు రాజ్యసభ కాదు కదా, అసలు అలీ మొహం కూడా చూడటం లేదు పార్టీ వాళ్ళు అని తెలిసింది.


సినిమా వాళ్ళని కేవలం పార్టీ ప్రచారాలకు మాత్రమే ఉపయోగించుకుంటున్నాడు జగన్ రెడ్డి. పాపం మన అలీ కి ఆ విషయం తెలియదు కదా, అందుకే చివరి నిముషం లో హడావిడిగా అప్పట్లో పార్టీ మారాడు. ఇప్పుడు ఏమైంది, అటుకి యిటుకి ఎటూ కాకుండా పోయింది. ఏమి చెయ్యాలో తెలియక, జగన్ రెడ్డి కి గుడ్ బై (Good Bye) చెప్పేద్దాం అని అనుకుంటున్నట్టు పరిశ్రమలో భోగట్టా. ఈమధ్య అలీ కొంతమంది మిత్రులను కలిసి ఈ విషయమే చెప్పి చాలా బాధపడ్డాడట. మరి జగన్ కి బై చెప్పి మళ్ళీ తెలుగు దేశం లో చేరతాడా? అంటే అది కూడా కొంచెం మొహమాటం గా ఉంటుంది కదా అలీ కి. అందుకని తన ఆప్త మిత్రుడు, స్నేహితుడు (Ali's close friend) అయినా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జనసేన (Jana Sena) పార్టీ లో చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలిసింది. పరిశ్రమలో అతని మిత్రులు కూడా అదే సలహా ఇచ్చారు అని తెలిసింది. ఆలా అయితే రాజమండ్రి నుండి జన సేన పార్టీ తరపున సీట్ ఖాయం చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ రానున్న రెండు  నెలల్లోనే తేల్చుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ (Next elections) కూడా వచ్చేస్తున్నాయి, అప్పటికి నియోజక వర్గం లో సమీకరణాలు జరపాలి అంటే టైం కావాలి కదా! అలీ అలోచించి నిర్ణయం తీసుకో అని సన్నిహితులు చెప్పారని తెలిసింది.

Updated Date - 2022-09-29T00:23:40+05:30 IST