Coffee with Karan : ఆ రియాలిటీ షో అంతా బూతే అంటున్నారు.. !

ABN , First Publish Date - 2022-09-14T19:56:40+05:30 IST

బాలీవుడ్‌లో మంచి పట్టున్న వ్యక్తి కరణ్ జోహార్. అతను ఎవరిని ఎప్పుడు పిలుస్తాడా, తాను తీయబోయే సినిమాకో, షో కో లేదా పార్టీకో అని బాలీవుడ్ లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారట. అంటే అతను ఎంత పలుకుబడి గల వ్యక్తో మీకు అర్థం అయి ఉంటుంది.

Coffee with Karan  : ఆ రియాలిటీ షో అంతా బూతే అంటున్నారు.. !

బాలీవుడ్‌లో మంచి పట్టున్న వ్యక్తి కరణ్ జోహార్ (Karan Johar). అతను ఎవరిని ఎప్పుడు పిలుస్తాడా, తాను తీయబోయే సినిమాకో, షో కో  లేదా పార్టీకో అని బాలీవుడ్ లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారట. అంటే అతను ఎంత పలుకుబడి గల వ్యక్తో మీకు అర్థం అయి ఉంటుంది. అతను ఈమధ్య  ‘కాఫీ విత్ కరణ్’ (Coffee with Karan) అనే రియాలిటీ షో మొదలెట్టాడు కదా. అందులో సెలెబ్రిటీలను పిలిచి ప్రశ్నలు అడుగుతాడు. వాళ్ళేవో  సమాధానాలు చెబుతారు. చిన్న చిన్న గేమ్స్ పేరిట కూడా ఎవరు తమ సెలబ్రిటీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తారు లాంటివి ఉంటాయి . కానీ ప్రధాన విషయం ఏంటంటే, ఆ షో అంతా బూతు పురాణమే అంటున్నారు చాలామంది. మన విజయ్ దేవరకొండని నువ్వు ఎప్పుడు సెక్స్ లో పాల్గొన్నావు అని ఒక ప్రశ్న అడిగితే, అతనితో వచ్చిన ఇంకో సెలబ్రిటీ అనన్య పాండే దానికి సమాధానం చెపుతోంది. 


అంటే ఆ షో ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా ఆ సెలెబ్రిటీలను మీరు ఇప్పుడు ఎవరితో వున్నారు? వాళ్ళతో మీకు అన్నీ (మీకు అర్థం అయిందని తెలుసు) అయిపోయాయా? లాంటి బూతు ప్రశ్నలకే  ప్రాధాన్యం ఇస్తున్నారు. టైగర్ ష్రాఫ్ (Tiger shrof) అండర్ వేర్ వేసుకోడట అప్పుడప్పుడు. అయితే ఇప్పుడు నా షో కి అలాగే వచ్చావా ఏంటి? అని అడుగుతాడు కరణ్. లేదు లేదు వేసుకున్నా అంటాడు టైగర్. పక్కనున్న కృతి సనన్ నవ్వుకుంటోంది ఆ సమాధానం విని. ఆమెని కూడా ఏవో  ప్రశ్నలు. నువ్వు వర్జినా కాదా? పలానా నటుడితో వున్నావా? విడిపోయావా? ఇంకా ఏవేవో సెక్స్ రిలేషన్‌షిప్‌కి సంబందించిన ప్రశ్నలే ఎక్కువ. వచ్చిన అందరి మీదా ఇలాంటి ప్రశ్నలనే సంధిస్తున్నాడు మన కరణ్ జోహార్. ఇలాంటి బూతు పురాణం ఉంటేనే ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడతారేమో. అలాగే మన తెలుగు ‘బిగ్‌బాస్’ (Bigboss) కూడా మొదలయ్యింది కదా. అది కూడా ఒక బ్రోతల్ హౌస్ లాంటిది అని సిపిఐ పార్టీ కి చెందిన నారాయణ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే కదా, ఇంకా ఆ రచ్చ నడుస్తోంది కూడా. ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే, ఏ రియాలిటీ షో చూసినా ఇలాగే నడుస్తున్నాయి.  ఏ రియాలిటీ షో చూసినా ఏమున్నది గర్వకారణం, బూతు పురాణం తప్ప అన్నది కామన్ అయిపోయింది.

Updated Date - 2022-09-14T19:56:40+05:30 IST