కాఫీ... కిల్లర్‌

ABN , First Publish Date - 2022-09-29T05:40:50+05:30 IST

సంగీత దర్శకుడు ఆర్‌. పి పట్నాయక్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కాఫీ విత్‌ ఎ కిల్లర్‌’. ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ చిత్రంతో...

కాఫీ... కిల్లర్‌

సంగీత దర్శకుడు ఆర్‌. పి పట్నాయక్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కాఫీ విత్‌ ఎ కిల్లర్‌’. ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ చిత్రంతో నిర్మాతగా పేరు తె చ్చుకున్న సెవెన్‌హిల్స్‌ సతీష్‌ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ చిత్రం ట్రైలర్‌ను ఆవిష్కరించి, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ట్రైలర్‌ థ్రిల్లింగ్‌గా, ఎంటర్టైనింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించిదని నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ చెప్పారు. ఎంటర్టైనింగ్‌తో కూడిన థ్రిల్లర్‌గా ‘కాఫీ విత్‌ ఎ కిల్లర్‌’ సినిమా కథ రాసుకొని దర్శకత్వం వ హించాను అని ఆర్‌. పి పట్నాయక్‌ చెప్పారు. ఈ సినిమాలో చిన్న సర్ర్పైజ్‌ ఉంది, ఆర్‌. పి గారితో ఇంకో రెండు ప్రాజెక్ట్స్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని సెవెన్‌హిల్స్‌ సతీష్‌ అన్నారు. 


Updated Date - 2022-09-29T05:40:50+05:30 IST