Vanisri: నటి వాణిశ్రీని పెద్ద స‌మ‌స్య నుంచి గ‌ట్టెక్కించిన సీఎం స్టాలిన్

ABN , First Publish Date - 2022-09-29T19:11:46+05:30 IST

సీనియర్ నటి వాణిశ్రీ (Vanisri) పేరుని.. ఇప్పటి కుర్రకారుకి కాస్త పరిచయం చేయాలేమో కానీ.. ఒకప్పుడు కుర్రకారుకి నిద్రలేకుండా చేసిన నటి ఆమె. ఏ పాత్రనైనా అలవోకగా..

Vanisri: నటి వాణిశ్రీని పెద్ద స‌మ‌స్య నుంచి గ‌ట్టెక్కించిన సీఎం స్టాలిన్

సీనియర్ నటి వాణిశ్రీ (Vanisri) పేరుని.. ఇప్పటి కుర్రకారుకి కాస్త పరిచయం చేయాలేమో కానీ.. ఒకప్పుడు కుర్రకారుకి నిద్రలేకుండా చేసిన నటి ఆమె. ఏ పాత్రనైనా అలవోకగా చేయగల సమర్థత కలిగిన నటి. ఎన్టీఆర్ (NTR), ఎఎన్నార్ (ANR), కృష్ణ (Krishna) వంటి హీరోలు చక్రం తిప్పుతున్న సమయంలో.. అగ్రతారగా తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్ వాణిశ్రీ (Actress Vanisri). హీరోయిన్‌గానే కాదు.. ఆ తర్వాత అత్తగా, అమ్మగా.. ఇలా ఎన్నో పాత్రలలో నటించి.. ప్రేక్షకులను అలరించిన వాణిశ్రీ.. గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటుంది. ఈ మధ్య ఆమెతో పెద్ద తరహా పాత్రలు చేయించేందుకు కొందరు ప్రయత్నించినా.. ఆమె అందుకు అంగీకరించలేదు. సినిమాలకే కాదు మీడియాకి కూడా ఆమె దొరకకుండా చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి ప్రశాంతమైన జీవితం గడుపుతున్న వాణిశ్రీకి సడెన్‌గా ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. అది ఆరోగ్యానికి సంబంధించిన సమస్య అనుకుంటారేమో.. అలాంటిదేమీ కాదు. ప్రస్తుతం తమిళనాడు (Tamil Nadu)లో ఉంటున్న వాణిశ్రీకి చెందిన స్థలాన్ని కొందరు కబ్జా చేశారట. ఆ స్థలం విలువ దాదాపు రూ. 20 కోట్లు అని తెలుస్తుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి ఆమె చాలా ప్రయత్నాలే చేసినట్లుగా సమాచారం.


అయితే వాణిశ్రీకి వచ్చిన సమస్యను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (Chief Minister of Tamil Nadu M K Stalin) తెలుసుకుని, ఆమెకు అండగా నిలబడ్డారు. ఆమె సమస్య ఏంటో తెలుసుకుని, దాని నుండి ఆమెను గట్టెక్కించారు. వాణిశ్రీకి చెందిన స్థ‌ల క‌బ్జా విష‌యానికి సంబంధించి పూర్తి వివరాలను పరిశీలించిన సీఎం ఎం.కె.స్టాలిన్, త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం (Tamil Nadu Government).. ఆమె భూమిని క‌బ్జా కోర‌ల్లో నుంచి విడిపించారు. సదరు భూమి ప‌త్రాల‌ను వాణిశ్రీకి స్టాలిన్ అప్ప‌గించారు. ఇదే సంద‌ర్భంలో న‌కిలీ ప‌త్రాలు, వ్య‌క్తుల ద్వారా రిజిస్ట్రేష‌న్ చేస్తే దాన్ని ర‌ద్దు చేసే అధికారాన్ని క‌లిగిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం. తన భూమిని తనకు అప్పగించిన స్టాలిన్ సాయానికి వాణిశ్రీ ధన్యవాదాలు తెలియచేశారు.

Updated Date - 2022-09-29T19:11:46+05:30 IST