సిరివెన్నెల లేరని తెలిసి ఎంతో విచారించాను: సీజేఐ ఎన్వీ రమణ

ABN , First Publish Date - 2021-12-01T02:07:39+05:30 IST

నలుగురి నోటా పది కాలాలు పలికే పాటలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు సీతారామశాస్త్రిగారు. సాహితీ విరించి సీతారామశాస్త్రిగారికి నా శ్రద్ధాంజలి’’ అని అన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ. సీతారామశాస్త్రి మరణవార్త విని

సిరివెన్నెల లేరని తెలిసి ఎంతో విచారించాను: సీజేఐ ఎన్వీ రమణ

‘‘నలుగురి నోటా పది కాలాలు పలికే పాటలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు సీతారామశాస్త్రిగారు. సాహితీ విరించి సీతారామశాస్త్రిగారికి నా శ్రద్ధాంజలి’’ అని అన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ. సీతారామశాస్త్రి మరణవార్త విని ఎంతో విచారించానని తెలిపిన ఆయన.. శ్రద్ధాంజలి ఘటిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

 

‘‘సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు ఇక లేరు అని తెలిసి ఎంతో విచారించాను. తెలుగు సినీ నేపథ్య గీతాల్లో సాహిత్యం పాలు తగ్గుతున్న తరుణంలో శాస్త్రిగారి ప్రవేశం పాటకు ఊపిరులూదింది. నలుగురి నోటా పది కాలాలు పలికే పాటలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు సీతారామశాస్త్రిగారు. సాహితీ విరించి సీతారామశాస్త్రిగారికి నా శ్రద్ధాంజలి. వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, లక్షలాది అభిమానులకు నా సానుభూతి..’’ అని సీజేఐ నూతలపాటి వెంకట రమణ పేర్కొన్నారు. 



Updated Date - 2021-12-01T02:07:39+05:30 IST