సారీ మేడమ్.. Sudhaa Chandranకు CISF క్షమాపణ

ABN , First Publish Date - 2021-10-22T22:22:40+05:30 IST

ఎయిర్ పోర్టులో సుధా చంద్రన్‌కు అవమానం జరిగిన సంగతి తెలిసిందే. ఆమె కృత్రిమ కాలును తీయాలని భద్రతా సిబ్బంది కోరారు. ఈటీడీ(ఎక్స్ ప్లోజివ్ ట్రేస్ డిటెక్టర్)‌తో చెక్ చేయమని ఆమె అడగగా వారు అందుకు అంగీకరించలేదు.

సారీ మేడమ్.. Sudhaa Chandranకు CISF క్షమాపణ

ఎయిర్ పోర్టులో సుధా చంద్రన్‌కు అవమానం జరిగిన సంగతి తెలిసిందే. ఆమె కృత్రిమ కాలును తీయాలని భద్రతా సిబ్బంది కోరారు. ఈటీడీ(ఎక్స్ ప్లోజివ్ ట్రేస్ డిటెక్టర్)‌తో చెక్ చేయమని ఆమె అడగగా వారు అందుకు అంగీకరించలేదు.  దీంతో మనస్తానికి గురైన ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయింది. నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో ఆమెకు మద్దతు లభించింది. 


దీంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్) ట్విట్టర్‌లో స్పందిస్తూ.. మమ్మల్ని క్షమించాలని కోరింది. సీఐఎస్ఎఫ్ మమ్మల్ని క్షమించమని వరుసగా ట్వీట్‌లు చేసింది. ‘‘ సుధా చంద్రన్‌కు ఎయిర్ పోర్టులో జరిగిన అవమానానికి మేం చింతిస్తున్నాం. నిబంధనల పకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో  భద్రతా కారణాల రీత్యా కృత్రిమ అవయవాలను అమర్చుకున్నవారు వాటిని తీసేయాల్సి ఉంటుంది. మీ రిక్వెస్ట్‌ని అంగీకరించని మహిళ అధికారిపై మేం తప్పకుండా దర్యాప్తు జరుపుతాం. కృత్రిమ అవయవాలను అమర్చుకుని ప్రయాణించే వారికి ఎటువంటి ఇబ్బంది కలగదని సుధా చంద్రన్‌కు మేం హామీ ఇస్తున్నాం ’’ అని సీఐఎస్‌ఎఫ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.






Updated Date - 2021-10-22T22:22:40+05:30 IST