సినిమానే నా జీవితం.. నా శ్వాస: Vikram

ABN , First Publish Date - 2022-07-13T19:26:16+05:30 IST

‘సినిమా కోసమే జీవిస్తా... అదే నా శ్వాస’ అని హీరో ‘చియాన్‌’ విక్రమ్‌ (Vikram) పేర్కొన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘కోబ్రా’ (Cobra). వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది.

సినిమానే నా జీవితం.. నా శ్వాస: Vikram

‘సినిమా కోసమే జీవిస్తా... అదే నా శ్వాస’ అని హీరో ‘చియాన్‌’ విక్రమ్‌ (Vikram) పేర్కొన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘కోబ్రా’ (Cobra). వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ఆడియో, ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో విక్రమ్‌ మాట్లాడుతూ... కొన్నేళ్ళుగా ఎన్నో విషయాలు చూశాను. విన్నాను. ఇపుడు విన్నది చాలా చిన్నది. వదంతులపై ఆదోళన అక్కర్లేదు. నా కుటుంబ, నా అభిమానులు మద్దతు ఉన్నంత వరకు నాకు ఏమి కాదు. 20 యేళ్ళ వయస్సులోనే నాకు ప్రమాదం జరిగింది. 


అపుడు ఓ కాలు కోల్పోవాల్సిన పరిస్థితి. ఆ గండం నుంచి గట్టెక్కాను. అలాంటి విషయాల ముందు ఇది పెద్దది కాదు. చిన్నపాటి అసౌకర్యం కారణంగా ఆస్పత్రిలో చేరాను. దాన్ని సునామీ గా మార్చేశారు. ఈ వార్తలను నన్ను ప్రేమించే వారిని సంకటస్థితిలోకి నెట్టాయి. అలాంటి వారందరికీ నేను క్షేమంగా ఉన్నానని తెలియజెప్పేందుకే ఈ వేదికపైకి వచ్చాను. కొన్నేళ్ళ కిత్రం ఒక యాడ్‌లో చోళన్‌గా నటించాను. ఇపుడు చోళరాజు కథాంశంతో నా కలల దర్శకుడు మణిరత్నం (Maniratnam) తెరకెక్కించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyan Selvan)లో ఆదిత్య కరికాలన్‌ పాత్ర పోషించాను. 


రెండు ఆస్కార్‌ అవార్డులు గెలుచుక్ను ఏ.ఆర్‌.రెహమాన్ (AR Rehaman) సంగీతం సమకూర్చారు. మనకు జీవితంలో ఏదైనా లక్ష్యం ఉంటే దాన్ని సాధించేందుకు నిరంతరం శ్రమించాలన్న సత్యాన్నిరెహమాన్ నుంచి గ్రహించాను. నాకు అభిమానుల ప్రేమాభిమానాలు పుష్కలంగా ఉన్నాయి. వారిని తలచుకుంటే మాటలు రావు’ అని పేర్కొన్నారు. కాగా, ఈ ఆడియో రిలీజ్‌ వేడుకలో హీరోయిన్‌ శ్రీనిధి శెట్టి (Srinidhi Setty), సంగీత దర్శకుడు ఏఆర్‌.రెహమాన్‌, మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ అధినేత ఉదయనిధి, యువ హీరో ధృవ్‌ విక్రమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-13T19:26:16+05:30 IST