కుహాసిని.. ఛాన్స్ పట్టేసింది

ABN , First Publish Date - 2022-04-27T02:13:06+05:30 IST

ప్రతిభావంతులైన నటీనటులను ప్రోత్సహించడంలో తమిళ చిత్రపరిశ్రమ ఎల్లపుడూ ముందువరుసలో ఉంటుంది. తాజాగా ఇటీవలే కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నటి కుహాసిని గుణశేఖరన్‌ ప్రధాన పాత్రలో స్టోన్‌బెంచ్‌ నిర్మాణ సంస్థ

కుహాసిని.. ఛాన్స్ పట్టేసింది

ప్రతిభావంతులైన నటీనటులను ప్రోత్సహించడంలో తమిళ చిత్రపరిశ్రమ ఎల్లపుడూ ముందువరుసలో ఉంటుంది. తాజాగా ఇటీవలే కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నటి కుహాసిని గుణశేఖరన్‌ ప్రధాన పాత్రలో స్టోన్‌బెంచ్‌ నిర్మాణ సంస్థ ఆడమ్‌ దాసన్‌ దర్శకత్వంలో ‘అనల్‌కాట్రు’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టింది. మోడల్‌గా చిత్రపరిశ్రమకు పరిచయమైన కుహాసిని.. వీడియో ఆల్బమ్స్‌లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. బుల్లితెరపై ప్రసారమైన ‘ఎంగవీట్టు మాప్పిళై’ అనే కార్యక్రమంలో కూడా ఆలరించింది. 


ఇండిపెండెంట్‌ ఆల్బమ్‌లలో నటించి తన ప్రతిభను నిరూపించుకుంటూ కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఇపుడు దర్శకుడు ఆడమ్‌ దాసన్‌ రూపొందించే చిత్రంలో ఈమె ప్రధాన పాత్ర పోషిస్తుంటే, మరో హీరోయిన్‌గా వనితా విజయకుమార్‌ నటిస్తోంది. మంచి ఎమోషనల్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కుహాసిని పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని దర్శకుడు చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Updated Date - 2022-04-27T02:13:06+05:30 IST