సినీ నిర్మాత ఇంట్లో లెక్కల్లో చూపని నగదు స్వాధీనం

ABN , First Publish Date - 2022-03-09T16:34:52+05:30 IST

తమిళ సినీ నిర్మాత ఎల్‌రెడ్‌ కుమార్‌కు చెందిన కార్యాలయాలు, గృహాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు గత మూడు రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో రూ. వెయ్యి కోట్లకు పైగా పన్ను ఎగవేతకు

సినీ నిర్మాత ఇంట్లో లెక్కల్లో చూపని నగదు స్వాధీనం

అడయార్‌(చెన్నై): తమిళ సినీ నిర్మాత ఎల్‌రెడ్‌ కుమార్‌కు చెందిన కార్యాలయాలు, గృహాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు గత మూడు రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో రూ. వెయ్యి కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా లెక్కల్లో చూపని రూ.3.82 కోట్ల నగదు, 8.4 కిలోల బంగారాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈయన ఉద్దేశపూర్వకంగా ఆదాయాన్ని తక్కువ చూపి పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-03-09T16:34:52+05:30 IST