ప్రాణాలర్పించేందుకు సిద్ధం

ABN , First Publish Date - 2022-07-06T15:50:29+05:30 IST

జీవితంలో అన్ని కోల్పోయానని తన దగ్గర కోల్పోయేందుకు ఏమీ లేదని, మిగిలింది ప్రాణమొక్కటేనని, దాన్ని కూడా త్యజించేందుకు సిద్ధంగా ఉన్నట్టు

ప్రాణాలర్పించేందుకు సిద్ధం

                      - దర్శకురాలు లీనా మణిమేఘలై


అడయార్‌(చెన్నై), జూలై 5: జీవితంలో అన్ని కోల్పోయానని తన దగ్గర కోల్పోయేందుకు ఏమీ లేదని, మిగిలింది ప్రాణమొక్కటేనని, దాన్ని కూడా త్యజించేందుకు సిద్ధంగా ఉన్నట్టు దర్శకురాలు లీనా మణిమేఘలై స్పష్టం చేశారు. ‘కాళి’ పేరుతో ఈమె తెరకెక్కించిన ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ పోస్టరుపై ఇపుడు తీవ్ర చర్చ సాగుతోంది. దీనిలో కాళిమాత సిగరెట్‌ తాగుతున్నట్టు డిజైన్‌ చేశారు. దీనిపై అనేక హిందూ సంఘాలతో పాటు భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పైగా రాష్ట్రంలోని తిరునెల్వేలి సహా ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి. దీనిపై ఆమె స్పందిస్తూ... ‘నావద్ద కోల్పోయేందుకు ఏమీలేదు. జీవించివున్నంత వరకు దేనికి భయపడకుండా గొంతెత్తి మాట్లాడాలనే ఇష్టపడుతున్నాను. ఇందుకోసం అవసరమైతే ప్రాణాలు సైతం ధారపోసేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని పేర్కొన్నారు. కాగా, లీనా మణిమేఘలై చర్యను సినీ నటి ఖుష్బూ కూడా తీవ్రంగా ఖండించిన విషయం తెల్సిందే. లీనా చేసిన పనితో సమాజంలో అశాంతికి దారితీస్తుందంటూ ఆమె ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2022-07-06T15:50:29+05:30 IST