Actor Vijay: సినిమాల పట్ల ఆసక్తి ఉన్నా.. చదువుపై నిర్లక్ష్యం వద్దు

ABN , First Publish Date - 2022-09-13T17:50:11+05:30 IST

సినిమాల పట్ల ఆసక్తి అనేది ప్రతి యువకుడికీ ఉంటుందని, అందులో ప్రవేశించడం కూడా తప్పుకాదని అయితే ఉన్నత విద్యను పూర్తీ

Actor Vijay: సినిమాల పట్ల ఆసక్తి ఉన్నా.. చదువుపై నిర్లక్ష్యం వద్దు

                             - విద్యార్థులకు నటుడు దునియా విజయ్‌ సూచన


బెంగళూరు, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): సినిమాల పట్ల ఆసక్తి అనేది ప్రతి యువకుడికీ ఉంటుందని, అందులో ప్రవేశించడం కూడా తప్పుకాదని అయితే ఉన్నత విద్యను పూర్తీ చేసేదాకా చదువుపైనే ధ్యాస ఉండాలని ప్రముఖ శాండల్‌వుడ్‌ నటుడు దునియా విజయ్‌ పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల వార్షికోత్సవం జరిగింది. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీటీ శ్రీనివాసనాయక్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన దునియా విజయ్‌ మాట్లాడుతూ డిగ్రీలు పూర్తీచేశాక రంగస్థలంలో ప్రవేశించి సినిమాలపై ఆసక్తి ఉంటే ప్రవేశించాలన్నారు. విద్యార్థి దశ దాటితే మరోసారి చదువు కొనసాగించడం కష్టమన్నారు. భవిష్యత్తు గురించి ఆలోచన, అవగాహన ఉండాల్సిందే అన్నారు. మీలోను ఒక లీడర్‌ ఉన్నారనేది తెలుసుకోవాలని సూచించారు. మరో నటుడు కోమల్‌ మాట్లాడుతూ ఇక్కడి కళాశాలలో విద్యతో పాటు కళలు, సాహిత్యం, సంగీతం, నాటకం, జానపదం రంగాలకు ప్రోత్సహించడంం సంతోషదాయకమన్నారు. సాంస్కృతిక సమితి సంచాలకులు డాక్టర్‌ టీ శశికళ, ఫిజికల్‌ డైరెక్టర్‌ ఆనంద్‌, కన్నడ సంఘం సంచాలకులు డాక్టర్‌ రుద్రేష్‌ అదరంగి పాల్గొన్నారు. విద్యార్థులు ఇదే సందర్భంలో డొళ్లుకుణిత నృత్యాన్ని ప్రదర్శించారు. ఉత్తమ విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.

Updated Date - 2022-09-13T17:50:11+05:30 IST