Arrest warrant: నటి మీరామిథున్‌కు అరెస్టు వారెంట్‌

ABN , First Publish Date - 2022-08-07T15:27:05+05:30 IST

బడుగు, బలహీన వర్గాలను కించపరుస్తూ వ్యాఖ్యానించారంటూ నమోదైన కేసులో తమిళ సినీనటి మీరామిథున్‌(Meeramithun is a Tamil actress)కు రెండోసారి

Arrest warrant: నటి మీరామిథున్‌కు అరెస్టు వారెంట్‌

ప్యారీస్‌(చెన్నై), ఆగస్టు 6: బడుగు, బలహీన వర్గాలను కించపరుస్తూ వ్యాఖ్యానించారంటూ నమోదైన కేసులో తమిళ సినీనటి మీరామిథున్‌(Meeramithun is a Tamil actress)కు రెండోసారి న్యాయస్థానం అరెస్ట్‌ వారెంట్‌ జారీచేసింది. సామాజిక మాధ్యమాల్లో ఆమె ఒక సామాజిక వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యానించారంటూ డీపీఐ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి వన్నియరసు గ్రేటర్‌ చెన్నై(Greater Chennai) పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో గత ఏడాది ఆగస్టు 7వ తేదీ ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సైబర్‌ నేరవిభాగం అధికారులు మీరామిథున్‌పై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి, అదే సంవత్సరం 14న కేరళ రాష్ట్రానికి వెళ్లి అరెస్ట్‌ చేశారు. ఆమెకు సహకరించిన అంబత్తూర్‌కు చెందిన అభిషేక్‌ను కూడా అరెస్ట్‌ చేసి బెయిలుపై విడుదల చేశారు. ఈ కేసు విచారణ చెన్నై ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు(Chennai Fast Track Court)లో శనివారం జరిగింది. ఈ సందర్భంగా నటి మీరామిథున్‌కు వ్యతిరేకంగా రెండోసారి అరెస్ట్‌ వారెంట్‌ను న్యాయమూర్తి అల్లి జారీచేశారు. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 29వ తేదీకి వాయిదావేసిన న్యాయమ్తూరి, విచారణకు హాజరుకాని కారణంగా మీరామిథున్‌కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌  జారీచేశారు.

Updated Date - 2022-08-07T15:27:05+05:30 IST