నటి మీరా మిథున్‌కు అరెస్టు వారెంట్‌

ABN , First Publish Date - 2022-03-24T16:10:16+05:30 IST

వివాదాస్పద సినీ నటి మీరా మిథున్‌కు చెన్నై ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టు అరెస్టు వారెంట్‌ జారీచేసింది. షెడ్యూల్‌ తెగలను కించపరచడం, అవమానించేలా వ్యాఖ్యానించిన

నటి మీరా మిథున్‌కు అరెస్టు వారెంట్‌

అడయార్‌(చెన్నై): వివాదాస్పద సినీ నటి మీరా మిథున్‌కు చెన్నై ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టు అరెస్టు వారెంట్‌ జారీచేసింది. షెడ్యూల్‌ తెగలను కించపరచడం, అవమానించేలా వ్యాఖ్యానించిన వ్యవహారంలో ఆమెపై కేసు నమోదైవుంది. ఈ కేసులో ఆమె విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆమెను అరెస్టు చేసి వచ్చే 4వ తేదీ కోర్టులో హాజరుపరచాల్సిందిగా సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ (సీసీబీ) పోలీసులను ఆదేశించింది. దీంతో ఆమె మరోమారు వార్తలకెక్కింది.

Updated Date - 2022-03-24T16:10:16+05:30 IST