శాకాహారి అయిన సినీనటితో Kissing సీన్ చిత్రీకరణకు ముందు మాంసాహారి అయిన సినీహీరో ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2022-07-18T14:56:42+05:30 IST

హాలీవుడ్ స్టార్ నటాలీ పోర్ట్‌మన్ ‘లవ్ అండ్ థండర్’ సినిమాలో ముద్దు సన్నివేశం చిత్రీకరణకు ముందు సంచలన నిర్ణయం తీసుకున్నారు....

శాకాహారి అయిన సినీనటితో Kissing సీన్ చిత్రీకరణకు ముందు మాంసాహారి అయిన సినీహీరో ఏం చేశాడంటే...

హాలివుడ్: హాలీవుడ్ స్టార్(hollywood star) నటాలీ పోర్ట్‌మన్ ‘లవ్ అండ్ థండర్’ సినిమాలో ముద్దు (kissing)సన్నివేశం చిత్రీకరణకు ముందు సంచలన నిర్ణయం తీసుకున్నారు. లవ్ అండ్ థండర్ సినిమా హీరోయిన్ అయిన క్రిస్ హేమ్స్‌వర్త్ శాకాహారి కావడంతో  హాలీవుడ్ స్టార్ నటాలీ పోర్ట్‌మన్ ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించే ముందు అతను మాంసాహారం తినడం మానేసిన విషయం తాజాగా వెలుగుచూసింది. హీరో నటాలీ పోర్ట్‌మన్ మాంసాహారి. ఇతను రోజుకు 4,500 కేలరీల మాంసాన్ని ప్రతి అరగంటకు కొంత చొప్పున తింటారు. సినీ హీరోయిన్ అయిన క్రిస్ హెమ్స్‌వర్త్  శాకాహారి కావడంతో ముద్దు సన్నివేశం చిత్రీకరణకు ముందు హీరోయిన్‌కు ఇబ్బంది కలగవద్దని హీరో పోర్ట్‌మన్ మాంసం తినకుండా నటించారు.


 తన సహ నటుడు పోర్ట్‌మన్ నిజంగా మంచి వ్యక్తి అని, ముద్దు సన్నివేశం చిత్రీకరణలో తనకు ఇబ్బంది కలగకుండా మాంసం తినలేదని సినీనటి క్రిస్ చెప్పింది. శాకాహారి అయిన తనను సహనటుడు తెరపై ముద్దు పెట్టుకునే ముందు మాంసం తినడం మానేయాలని పట్టుబట్టలేదని, అయినప్పటికీ హేమ్స్‌వర్త్ మాంసం ముట్టకుండా తీసుకున్న మంచి నిర్ణయం అని క్రిస్ పేర్కొంది.


 క్రిస్,హేమ్స్ వర్త్ లు కలిసి ముద్దు సన్నివేశాల్లో నటించిన ‘లవ్ అండ్ థండర్’ సినిమా జూలై 8న విడుదలైంది.ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 302 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. 

Updated Date - 2022-07-18T14:56:42+05:30 IST