SS Rajamouli: మహేశ్ బాబు సినిమాలో హాలీవుడ్ హీరో

ABN , First Publish Date - 2022-09-25T20:51:14+05:30 IST

‘ఆర్ఆర్ఆర్’ (RRR) తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు యస్‌యస్.రాజమౌళి (SS Rajamouli). జూనియర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ

SS Rajamouli: మహేశ్ బాబు సినిమాలో హాలీవుడ్ హీరో

‘ఆర్ఆర్ఆర్’ (RRR) తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు యస్‌యస్.రాజమౌళి (SS Rajamouli). జూనియర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.1200కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ సినిమా హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 20నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీ ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి వెస్ట్రన్ ఆడియన్స్ ఈ మూవీపై  ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు అనేక మంది రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంభించారు. ఇండియాతో పాటు విదేశాల్లోని ప్రేక్షకులు జక్కన్న నుంచి రాబోయే తర్వాతి ప్రాజెక్టు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, రాజమౌళి టాలీవుడ్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu)తో మూవీ చేయనున్నట్టు గతంలోనే చెప్పాడు. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి నేపథ్యంలో కథ రాస్తున్నట్టు వెల్లడించాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్ చేస్తుంది. ఈ సినిమాలో ఓ హాలీవుడ్ హీరో నటించనున్నట్టు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. 


హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్స్‌వ‌ర్త్ (Chris Hemsworth) మహేశ్ బాబు సినిమాలో నటించనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మేకర్స్ క్రిస్‌తో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. కానీ, అతడు మాత్రం తన అంగీకారాన్ని తెలియజేయలేదట. క్రిస్‌తో పాటు మరికొంత మంది హాలీవుడ్ నటులు కూడా ఈ మూవీలో కీలక పాత్రలు పోషించనున్నారట. హాలీవుడ్ టాలెంట్ కంపెనీ ‘క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ’ తో జక్కన్న ఒప్పందం కుదుర్చుకోవడం ఈ వదంతులకు మరింత బలం చేకూరుస్తుంది. కానీ, హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్స్‌వర్త్ నటిస్తున్నట్టు చిత్ర బృందం ఇంత వరకు ప్రకటించలేదు. క్రిస్ మార్వెల్ సినీమాటిక్ యూనివర్స్‌లో థోర్ (Thor) పాత్రలో కనిపించాడు. ఈ రోల్‌తోనే ప్రపంచవ్యాప్తంగా ఫేమ్‌ను సంపాదించుకున్నాడు.

Updated Date - 2022-09-25T20:51:14+05:30 IST