Unstoppable: బాలయ్య ఆన్ స్థాపబుల్ లో మొదటి గెస్ట్ ఎవరో తెలుసా?

ABN , First Publish Date - 2022-10-04T21:35:53+05:30 IST

ఈ రెండో సీజన్ ఎవరితో మొదలవ్వబోతోంది అన్న సందేహం చాలామందికి వచ్చింది. కొందరు చిరంజీవి (Chiranjeevi) అని, కొందరు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan and Trivikram Srinivas) మరియు త్రివిక్రమ్ ల జంట తో మొదలవుతుందని అనుకున్నారు. కానీ అందరిని ఆశ్చర్య పరిచేలా (Surprising guest) ఈ మొదటి అతిధి పేరు వింటే అందరు చాలా షాక్ అవుతారు.

Unstoppable: బాలయ్య ఆన్ స్థాపబుల్ లో మొదటి గెస్ట్ ఎవరో తెలుసా?

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రియాలిటీ షో (Reality show Unstoppable) ఆన్ స్థాపబుల్ రెండో సీజన్లో (Second season) మొదలవుతున్న సంగతి తెలిసిందే. ఇది ఆహా ఓటిటి (Aha OTT) ఛానల్ లో వస్తుంది. మొదటి సీజన్ చాల పెద్ద సక్సెస్ అవటంతో, ఇప్పుడు రెండో సీజన్ మొదలయింది. అయితే ఈ రెండో సీజన్ ఎవరితో మొదలవ్వబోతోంది అన్న సందేహం చాలామందికి వచ్చింది. కొందరు చిరంజీవి (Chiranjeevi) అని, కొందరు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan and Trivikram Srinivas) మరియు త్రివిక్రమ్ ల జంట తో మొదలవుతుందని  అనుకున్నారు. కానీ అందరిని ఆశ్చర్య పరిచేలా (Surprising guest) ఈ మొదటి అతిధి పేరు వింటే అందరు చాలా షాక్ అవుతారు. అది మరెవరో కాదు, తెలుగు దేశం పార్టీ అథినేత (Telugu Desam Party), బాలకృష్ణ బావగారు (Balakrishna's brother-in-law) అయిన నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu). 



ఈ ఆన్ స్థాపబుల్ రెండో సీజన్ స్టార్ట్ అవబోతోందని విజయవాడలో పెద్ద ఎత్తున దీని కోసం ఒక ఈవెంట్ చేసారు. అక్కడే సెట్ వేసి, మొదటి అతిధి గా నారా చంద్రబాబు నాయుడు ని తీసుకువచ్చారు, అని తెలిసింది.  ఇది చాలా ఆసక్తికరంగా వుండబోతోంది కదా. ఎందుకంటే చంద్రబాబు ఎన్నో ఇంటర్వూస్ (Interviews) ఇచ్చి ఉండొచ్చు, టీవీ లో మాట్లాడవచ్చు, కానీ ఇందులో బాలకృష్ణ అడిగే ప్రశ్నలు (Questions) వెరైటీ (Variety) గా ఉండబోతున్నాయి, అయన ఏమి అడుగుతారు, చంద్రబాబు వాటికీ  సమాధానాలు ఎలా చెప్తారు అన్నదే ఆసక్తికరం. ఈ ఇద్దరి కాంబినేషన్ (Balakrishna and CBN combination) అంటేనే చాల సర్ప్రైజ్ కదా. ఆన్ స్థాపబుల్  మొదటి అతిధి తోటే, బాలకృష్ణ ట్రెండ్ సృష్టిస్తున్నాడు. ఇంకా మిగతా ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయో, చూడాల్సిందే. ఈ దసరాకి మొదటి ఎపిసోడ్ టెలికాస్ట్ అవొచ్చు అని కూడా అంటున్నారు.   

సురేష్ కవిరాయని



Updated Date - 2022-10-04T21:35:53+05:30 IST