Cobra Twitter Review: చియాన్ విక్రమ్ మూవీ ఎలా ఉందంటే..?

ABN , First Publish Date - 2022-08-31T16:49:36+05:30 IST

ఎప్పటికప్పుడు విలక్షణమైన కథలతో వస్తూ ప్రేక్షకులను అలరించే తమిళ నటుడు చియాన్ విక్రమ్(Chiyaan Vikram).

Cobra Twitter Review: చియాన్ విక్రమ్ మూవీ ఎలా ఉందంటే..?

ఎప్పటికప్పుడు విలక్షణమైన కథలతో వస్తూ ప్రేక్షకులను అలరించే తమిళ నటుడు చియాన్ విక్రమ్(Chiyaan Vikram). ‘శివపుత్రుడు’, ‘అపరిచితుడు’ వంటి సినిమాలో తెలుగులోనూ మంచి పాపులారిటీ సాధించాడు. అప్పటి నుంచి ఆయన ప్రతి సినిమా కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ విడుదల అవుతూ ఉంటుంది. విక్రమ్ తాజాగా నటించిన చిత్రం ‘కోబ్రా(Cobra)’. వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే ఆర్.అజయ్ జ్ఞానముత్తు ఈ సినిమాకి దర్శకుడు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, మీనాక్షి, మృణాళిని హీరోయిన్లుగా నటించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం నేడు(ఆగస్టు 31) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.


సైకాలజికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై  భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు.. విక్రమ్ పది రకాల పాత్రల్లో కనిపించబోతున్నాడంటూ.. ప్రమోషన్స్‌ సైతం ఓ రేంజ్‌లో చేయడంతో ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. అలాగే.. ఇటీవలే విడుదలై ట్రైలర్ కూడా డిఫరెంట్‌గా ఉండడం ఆ అంచనాలు ఇంకా పెరిగాయి. ఇప్పటికే ఓవర్సీస్‌తోపాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. ఈ తరుణంలో ఓవర్సీస్‌తోపాటు దేశంలోని పలు చోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు ‘కోబ్రా’ రివ్యూని షేర్ చేస్తున్నారు.

అందులో.. కోలీవుడ్‌లో వచ్చిన మంచి చిత్రాల్లో ఇది ఒకటి. యాక్షన్, ఫైట్ సీన్ల అయితే చాలా క్లాసిక్‌గా ఉన్నాయి. సూపర్ మూవీతో చియాన్ విక్రమ్ కమ్ బ్యాక్ ఇచ్చాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా.. విక్రమ్ యాక్టింగ్‌తోపాటు ఇతర నటులు, కథ, కథనం బావున్నాయంటూ చెప్పుకొస్తున్నారు. ఇంకా ఈ సినిమాపై వారి రియాక్షన్ ఏంటో చూద్దాం..













Updated Date - 2022-08-31T16:49:36+05:30 IST