Cobra: ఫైనల్‌గా విక్రమ్ ‘కోబ్రా’ వచ్చేది ఎప్పుడంటే..

Twitter IconWatsapp IconFacebook Icon
Cobra: ఫైనల్‌గా విక్రమ్ కోబ్రా వచ్చేది ఎప్పుడంటే..

విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) హీరోగా.. ఆర్ అజయ్ జ్ఞానముత్తు (R. Ajay Gnanamuthu) దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కోబ్రా’. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ (SS Lalith Kumar) ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీనిధి శెట్టి (కెజియఫ్ ఫేమ్) (Srinidhi Shetty) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో.. హీరో విక్రమ్ గణితశాస్త్ర మేధావి పాత్రలో నటిస్తున్నారు. ఆగస్ట్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ఇంతకుముందు అధికారికంగా ప్రకటించారు. కానీ ఆ తేదీకి ఈ చిత్రం విడుదల కావడం లేదు. తాజాగా.. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లుగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. (Cobra Release Date)


విడుదల తేదీని తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఈ పోస్టర్‌లో విక్రమ్ రెయిన్‌లో యాక్షన్ మోడ్‌లో ఉన్నారు. ఈ రెయిన్ ఫైట్ సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉండబోతుందనేది.. ఈ పోస్టర్ చూస్తుంటే తెలిసిపోతుంది. ఈ సినిమాలో ఇండియన్ వెటరన్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలో నటించగా.. మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (A. R. Rahman) ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. హరీష్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని.. సినిమా ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్వీ ప్రసాద్ (NV Prasad) భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

Cobra: ఫైనల్‌గా విక్రమ్ కోబ్రా వచ్చేది ఎప్పుడంటే..


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.