Cobra: అధీరాతో అదరగొడుతోన్న చియాన్ విక్రమ్

ABN , First Publish Date - 2022-07-19T01:23:01+05:30 IST

చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) హీరోగా.. ఆర్ అజయ్ జ్ఞానముత్తు (R Ajay Gnanamuthu) దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కోబ్రా’ (Cobra). సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్..

Cobra: అధీరాతో అదరగొడుతోన్న చియాన్ విక్రమ్

చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) హీరోగా.. ఆర్ అజయ్ జ్ఞానముత్తు (R Ajay Gnanamuthu) దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కోబ్రా’ (Cobra). సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ (SS Lalit Kumar) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 11న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలకాబోతోన్న ఈ చిత్రం నుండి  ‘అధీరా’ (Adheeraa) అనే లిరికల్ సాంగ్‌ను సోమవారం మేకర్స్ విడుదల చేశారు. ఏఆర్ రెహమాన్ (AR Rahman) ఈ పాటని ఫుట్‌టాపింగ్, రాకింగ్ నంబర్‌‌గా కంపోజ్ చేశారు. ఈ పాట కథానాయకుడి పాత్ర యొక్క ఉన్నతమైన లక్షణాలను వర్ణిస్తూ ప్రస్తుతం సోషల్ మీడియాలో అదరగొడుతోంది. హరిప్రియ, నకుల్ అభ్యంగర్ ఈ పాటని ఎనర్జిటిక్‌గా ఆలపించగా.. రాకేందు మౌళి సాహిత్యం అందించారు.


గణితశాస్త్ర మేధావి పాత్రలో చియాన్ విక్రమ్ నటిస్తోన్న ఈ చిత్రంలో.. అతని సరసన ‘కెజియఫ్’ (KGF) ఫేమ్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)  హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ఇండియన్ వెటరన్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) కీలక పాత్ర పోషించడం విశేషం. మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్వీ ప్రసాద్ (NV Prasad).. ఈ చిత్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విడుదల హక్కులను సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు.



Updated Date - 2022-07-19T01:23:01+05:30 IST