Chiyaan Vikram: ‘కోబ్రా’ కు భారీ పారితోషికం

ABN , First Publish Date - 2022-08-29T22:41:30+05:30 IST

విలక్షణమైన పాత్రలు, వైవిధ్య భరితమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). పాత్ర కోసం ఎంతకైనా శ్రమిస్తాడు. ప్రతి చిత్రంలో విభిన్న గెటప్పుల్లో కనిపించి

Chiyaan Vikram: ‘కోబ్రా’ కు భారీ పారితోషికం

విలక్షణమైన పాత్రలు, వైవిధ్య భరితమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). పాత్ర కోసం ఎంతకైనా శ్రమిస్తాడు. ప్రతి చిత్రంలో విభిన్న గెటప్పుల్లో కనిపించి అబ్బురపరుస్తుంటాడు. ‘అపరిచితుడు’, ‘ఐ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. విక్రమ్ తాజాగా నటించిన సినిమా ‘కోబ్రా’ (Cobra). తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 31న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త కోలీవుడ్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఈ చిత్రానికి విక్రమ్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడని తెలుస్తోంది. 


సినిమాను బట్టి విక్రమ్ రెమ్యూనరేషన్ తీసుకుంటుంటాడు. ప్రతి మూవీకి రూ. 20కోట్ల నుంచి రూ. 25కోట్ల వరకు ఛార్జ్ చేస్తుంటాడు. ‘కోబ్రా’ కు రూ. 25కోట్లను పారితోషికంగా తీసుకున్నాడని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ రెమ్యూనరేషన్ సినిమా బడ్జెట్‌లో దాదాపుగా 22శాతమంట. విక్రమ్ ఈ మూవీలో 10గెటప్పుల్లో కనిపించనున్నాడు. అందుకోసం చాలా శ్రమించాల్సి వచ్చిందట. అందువల్లే మేకర్స్ కూడా విక్రమ్ డిమాండ్ చేసినంత రెమ్యూనరేషన్‌ను ఇచ్చారట. ‘కోబ్రా’ లో శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్‌గా నటించింది. ఆర్. అజయ్ జ్ఞానముత్తు (R. Ajay Gnanamuthu) దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్‌ఎస్ లలిత్ కుమార్ (S.S. Lalit Kumar) ఈ మూవీని నిర్మించాడు. కోబ్రా’ లో విక్రమ్ గణిత శాస్త్రవేత్తగా కనిపించనున్నాడు. అసాధ్యమైన కేసులను తన గణిత మేధస్సుతో పరిష్కరించే వ్యక్తిగా అలరించనున్నాడు. ఈ మూవీలో విక్రమ్‌కు సవాల్ విసిరే పాత్రను ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) పోషించాడు. ఏఆర్ రెహమాన్ (A. R. Rahman) సంగీతం అందించాడు. ఈ సినిమాలో ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2022-08-29T22:41:30+05:30 IST