Rangamarthanda కోసం మెగాస్టార్ షాయరీ..

ABN , First Publish Date - 2022-06-28T16:28:30+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘గాడ్‌ఫాదర్’ (Godfather) చిత్రాన్ని ఈ సెప్టెంబర్ లోనూ, ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదలకు సిద్ధం చేస్తుండగా.. ‘భోళాశంకర్’ (Bhola Shankar) మూవీ సైతం వచ్చే ఏడాదిలోనే విడుదల కాబోతోంది.

Rangamarthanda కోసం మెగాస్టార్ షాయరీ..

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘గాడ్‌ఫాదర్’ (Godfather) చిత్రాన్ని ఈ సెప్టెంబర్ లోనూ, ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదలకు సిద్ధం చేస్తుండగా.. ‘భోళాశంకర్’ (Bhola Shankar) మూవీ సైతం వచ్చే ఏడాదిలోనే విడుదల కాబోతోంది. వీటితో పాటు చిరు.. మరికొన్ని సినిమాల్ని లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఇటు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. ఇతర చిత్రాల ప్రచారంలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి తన కెరీర్‌లోనే సమ్ థింగ్ స్పెషల్ అనదగ్గ రీతిలో ఒక సినిమాను ప్రమోట్ చేయబోతున్నారు. ఆ చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda). క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamshy) దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్ (Prakashraj) ప్రధానపాత్ర చేస్తున్నారు. మరాఠీ సూపర్ హిట్ ‘నటసమ్రాట్’ (Natasamrat) సినిమాకిది అఫీషియల్ రీమేక్. నానా పాటేకర్ (Nanapatekar) ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాకి అక్కడ మంచి పేరొచ్చింది. ఈ సినిమాను కృష్ణవంశీ తనదైన శైలిలో తెలుగు నేటివిటీకి అనుగుణంగా తీర్చిదిద్దారు. 


షూటింగ్ చివరిదశకు చేరుకున్న ‘రంగమార్తాండ’ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా (Ilayaraja) సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు ఒక అందమైన నెరేటివ్ స్టైల్లో తెరపై ఆవిష్కరించబోతున్నారు. దాని కోసం మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపుతున్నారని టాక్. చిరంజీవి ఈ సినిమా కోసం తన కెరీర్ లోనే మొట్టమొదటి సారిగా షాయరీ (Shayari) వినిపించబోతున్నారట. రెగ్యులర్ వాయిస్ ఓవర్ కు చాలా భిన్నమైనది ఈ షాయరీ. సినిమాలోని ఎమోషన్‌ను బలంగా క్యారీచేయడానికి షాయరీ ఎంతగానో తోడ్పడుతుంది.  దానికి చిరంజీవి వాయిసే బెటర్ ఛాయిస్ అని కృష్ణవంశీ భావిస్తున్నారట. ఆ మేరకు చిరు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందట. ఈ షాయరీతో ప్రేక్షకుల హృదయాల్ని ఎమోషనల్ గా టచ్ చేయొచ్చన్నది కృష్ణవంశీ ఆలోచన. 


నిజానికి షాయరీ అంటే.. ఒక డైలాగ్ కాదు, ఒక పాట కాదు.. అదొక అందమైన పొయటిక్ ఎక్స్‌ప్రెషన్. ఆ ప్రక్రియను ‘రంగమార్తాండ’ చిత్రం కోసం కృష్ణవంశీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషాన్ని సంతరించుకుంది. దీనికి ఇళయరాజా అద్భుతమైన నేపథ్య సంగీతం కూడా తోడైతే.. ‘రంగమార్తాండ’ చిత్రం ప్రేక్షకుల్ని ఎమోషనల్ గా బాగా కదిలించే అవకాశాలున్నాయి. మరి చిరు షాయరీ.. ఈ సినిమాకి ఏ స్థాయిలో హైలైట్ అవుతుందో చూడాలి.  

Updated Date - 2022-06-28T16:28:30+05:30 IST