ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్‌లకు Chiranjeevi శుభాకాంక్షలు..

ABN , First Publish Date - 2022-07-07T15:57:36+05:30 IST

తాజాగా రాజ్యసభకు ఎంపికైన అగ్ర సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja), బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) లను సినీ ప్రముఖులంతా ప్రశంసలతో ముంచెత్తుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్‌లకు Chiranjeevi శుభాకాంక్షలు..

తాజాగా రాజ్యసభకు ఎంపికైన అగ్ర సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja), బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) లను సినీ ప్రముఖులంతా ప్రశంసలతో ముంచెత్తుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) వీరికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇప్పుడు మన టాలీవుడ్ లెజండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన ట్విట్టర్ ఖాతాలో ఇళయరాజాకు, విజయేంద్ర ప్రసాద్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ వేరు వేరుగా పోస్టులు పెట్టారు. అలాగే, భారత ప్రధాని నరేంద మోదీకి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలిపారు.  


భారతదేశ కేంద్రప్రభుత్వం రాష్ట్రపతి కోటాలో మొత్తం నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. వారు సంగీత దర్శకుడు ఇళయరాజా, కథకుడు విజయేంద్ర ప్రసాద్, పరుగుల రాణి పీటి ఉష, సామజిక సేవకుడు వీరేంద్ర హెగ్డే. ఈ నేపథ్యంలో 'ఈ నలుగురు దిగ్గజ ప్రముఖులని రాజ్యసభకు నామినేట్ చేయడం ఎంతో గర్వంగా ఉంది..అని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అభినందనలు తెలియచేశారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి వరుస ట్వీట్స్ చేసి అటు మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు..ఇటు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. 


ముందుగా చిరంజీవి భారత ప్రధానికి.. 'సినీ పరిశ్రమకు చెందిన అత్యంత యోగ్యత కలిగిన ప్రముఖులు శ్రీ.కె.వి.విజయేంద్ర ప్రసాద్‌గారికి, శ్రీ ఇళయరాజాగారికి రాజ్యసభ సభ్యులుగా రాష్ట్రపతి నామినేషన్‌కు అర్హమైన గౌరవాన్ని అందించినందుకు గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ గారికి కృతజ్ఞతలు'. అని కృతజ్ఞతలు తెలిపారు. 


అలాగే, 'అసమానమైన సంగీత మేధావి ఇళయరాజాకి హృదయ పూర్వక అభినందనలు. రాజ్యసభలో మీరు అడుగుపెట్టిన తర్వాత ఎగువ సభలో మేదావి వర్గాల్లో ఒకరిగా ఖచ్చితంగా గుర్తింపు సాధిస్తారు. మీలాంటి గొప్ప వ్యక్తి నా సినిమాలకు సంగీతాన్ని అందించడం సంతోషంగా అనిపిస్తోంది"..అని ఇళయరాజాకు విషెస్ చెప్పారు. ఇదే క్రమంలో.. 'భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత నిష్ణాతులు, అద్భుతమైన కథా రచయితలలో ఒకరైన కె.వి.విజయేంద్ర ప్రసాద్ పార్లమెంటు సభ్యునిగా - రాజ్యసభ సభ్యునిగా నామినేట్ అయినందుకు హృదయపూర్వక అభినందనలు. మీ ఉనికి మన ఎగువ సభ కీర్తిని పెంచుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు'..అంటూ శుభాకాంక్షలు తెలిపారు. 







Updated Date - 2022-07-07T15:57:36+05:30 IST