God father: మీ ఊపిరి గాల్లో కలిపేస్తా.. వార్నింగ్‌ ఎవరికి?

ABN , First Publish Date - 2022-09-29T22:07:36+05:30 IST

వారం రోజుల క్రితం ఓ పొలిటికల్‌ డైలాగ్‌తో చిరంజీవి ట్విట్టర్‌లో విడుదల చేసిన డైలాగ్‌ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే! తాజాగా మరో డైలాగ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

God father: మీ ఊపిరి గాల్లో కలిపేస్తా.. వార్నింగ్‌ ఎవరికి?

వారం రోజుల క్రితం ఓ పొలిటికల్‌ డైలాగ్‌తో చిరంజీవి (Chiranjeevi) ట్విట్టర్‌లో విడుదల చేసిన డైలాగ్‌ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే! తాజాగా మరో డైలాగ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. బుధవారం అనంతపురంలో జరిగిన 'గాడ్ ఫాదర్' (God father) ప్రీ రిలీజ్‌ వేడుకలో అభిమానుల కోరిక మేరకు చిరంజీవి  సినిమాలోని ఓ డైలాగ్‌ను ప్రేక్షకుల మీదకు విసిరారు.


(warning dailogue) ‘ఇన్నాళ్లు రోడ్డు కాంట్రాక్టులు, ఇసుక కాంట్రాక్టులు, కొండ, నేల, నీళ్లు, మద్యం కాంట్రాక్టులు అంటూ ప్రజల సొమ్ము అడ్డంగా తిని ఒక్కొక్కళ్లూ బలిసి కొట్టుకుంటున్నారు. ఇక నుంచి మీరు పీల్చే గాలి కాంట్రాక్ట్‌ నేను తీసుకుంటున్నా. ఇందులో ఒకటే రూల్‌.. ఇక నుంచి ప్రజలకు సుపరిపాలన అందించాలనే నిర్ణయం, తప్పు చేయాలంటే భయం మాత్రమే మీ మనసుల్లో ఉండాలి. లేదంటే మీ ఊపిరి గాల్లో కలిసిపోతుంది’’ అన్న డైలాగ్‌ చెప్పి అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఇదే డైలాగ్‌ను చిరంజీవి గురువారం ట్వీట్‌ చేశారు. మాటల రచయిత లక్ష్మీ భూపాలకు అభినందనలు తెలిపారు. ‘మంచి ప్రతిభ ఉన్న భూపాలకు రెంతో మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నానని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు. పది రోజుల క్రితం డైలాగ్‌ ఆడియోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్‌గా రచ్చ చేసిన మెగాస్టార్‌ ఇప్పుడు దానిని నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ డైలాగ్‌ సంచలనం అవ్వడమే కాకుండా ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తుంది. వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఈ డైలాగ్‌ సినిమాలో పెట్టారని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ సారి పొలిటికల్‌ వార్నింగ్‌ ఇచ్చారనే టాక్‌ నడుస్తోంది. అయితే ఇది చిత్రంలోని ఎమ్మెల్యేలకు వార్నింగ్‌ ఇస్తూ చెప్పే డైలాగ్‌ అని చిరంజీవి ఆ వేదికపై క్లారిటీ ఇచ్చారు. మోహన్‌ రాజా (mohan raja) దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళ సూపర్‌హిట్‌ ‘లూసిఫర్‌’కు రీమేక్‌ ఇది. సల్మాన్‌ ఖాన్‌ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. నయనతారా, సత్యదేవ్‌, సముద్రఖని కీలక పాత్రధారులు. తమన్‌ స్వరకర్త. ఆర్‌.బి.చౌదరి, ఎన్‌.వి. ప్రసాద్‌, రామ్‌చరణ్‌ నిర్మాతలు. 





Updated Date - 2022-09-29T22:07:36+05:30 IST