Brahmastra: ‘బ్రహ్మాస్త్ర’లో భాగమైన చిరంజీవి!

ABN , First Publish Date - 2022-06-13T19:17:13+05:30 IST

‘ఆ బ్రహ్మాస్త్రం’ యొక్క విధి తన అరచేతి రేఖల్లో చిక్కుకుందన్న విషయం ఆ యువకుడికే తెలియాలి. అతనే శివ’ అంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఇది ఆయన నటించిన చిత్రంలో డైలాగ్‌ అనుకుంటే పొరపాటే. రణబీర్‌ కపూర్‌, ఆలియాభట్‌ జంటగా నటించిన చిత్రం ‘బహ్మాస్త్ర’ (Brahmastra) చిత్రంలోని హీరోకు సంబంధించి డైలాగ్‌. తెలుగులో ‘బహ్మస్త్ర: మొదటిభాగం శివ’ విడుదల కానున్న ఈ చిత్రానికి చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు.

Brahmastra: ‘బ్రహ్మాస్త్ర’లో భాగమైన చిరంజీవి!

‘ఆ బ్రహ్మాస్త్రం’ యొక్క విధి తన అరచేతి రేఖల్లో చిక్కుకుందన్న విషయం ఆ యువకుడికే తెలియాలి. అతనే శివ’ అంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఇది ఆయన నటించిన చిత్రంలో డైలాగ్‌ అనుకుంటే పొరపాటే. రణబీర్‌ కపూర్‌, ఆలియాభట్‌ జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) చిత్రంలోని హీరోకు సంబంధించి డైలాగ్‌. తెలుగులో ‘బ్రహ్మాస్త్రం: మొదటిభాగం శివ’ పేరుతో విడుదల కానున్న ఈ చిత్రానికి చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. హీరో క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ ఆయన చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను చిత్ర బృందం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.


అయాన్‌ ముఖర్జీ (Ayan mukharji)దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 15న ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. సెప్టెంబర్‌ 9న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ  చిత్రానికి రాజమౌళి సమర్పకుడు. (Chiranjeevi voiceover for Brahmastra)




Updated Date - 2022-06-13T19:17:13+05:30 IST