Laal Singh Chaddha: ఆ ‘బాలరాజు’ మనవడే.. ఈ చెడ్డీ బడ్డీ అంటోన్న చిరు

ABN , First Publish Date - 2022-07-21T01:11:27+05:30 IST

వయోకామ్ 18 స్టూడియోస్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆమిర్ ఖాన్ (Aamir Khan), కిరణ్ రావు, జ్యోతిదేశ్ పాండే, అజిత్ అంథారే నిర్మిస్తున్న చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న

Laal Singh Chaddha: ఆ ‘బాలరాజు’ మనవడే.. ఈ చెడ్డీ బడ్డీ అంటోన్న చిరు

వయోకామ్ 18 స్టూడియోస్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆమిర్ ఖాన్ (Aamir Khan), కిరణ్ రావు, జ్యోతిదేశ్ పాండే, అజిత్ అంథారే నిర్మిస్తున్న చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) తెలుగులో సమర్పిస్తున్నారు. ఈ విషయం రీసెంట్‌గా ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. చిరంజీవి సినీ కెరీర్‌లో ఓ చిత్రాన్ని సమర్పిస్తుండటం ఇదే మొదటిసారి. ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కోసం.. ఆమిర్ ఖాన్ ప్రీమియర్‌ను ఏర్పాటు చేయగా.. ఈ ప్రీమియర్ అనంతరం, ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయాలని చిరంజీవి కోరడం, మీరు సమర్పిస్తానంటే విడుదల చేస్తానని ఆమిర్ చెప్పడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఆమిర్ ఖాన్ మాటను కాదనలేక ఈ చిత్రాన్ని సమర్పించేందుకు చిరంజీవి ముందుకొచ్చారు. వెంటనే ‘లాల్ సింగ్ చడ్డా’ చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఆ తర్వాత ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న కరీనా కపూర్ (Kareena Kapoor) లుక్‌ని రివీల్ చేశారు. తాజాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న టాలీవుడ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) లుక్‌ని కూడా చిరంజీవి విడుదల చేశారు. ఆ ‘బాలరాజు’(Balaraju) మనవడే.. ఈ చెడ్డీ బడ్డీ ‘బాలరాజు’ అంటూ నాగచైతన్య లుక్‌ని ట్విట్టర్ వేదికగా చిరు రివీల్ చేశారు.


‘‘ ‘లాల్ సింగ్ చడ్డా’, చెడ్డీ బడ్డీ ‘బాలరాజు’ ని మీకు పరిచయం చేస్తున్నాను. అలనాటి ‘బాలరాజు’ మనవడు.. మన అక్కినేని నాగ చైతన్యే ఈ బాలరాజు..’’ అంటూ సైనికుడి రూపంలో చిరు నవ్వును ప్రదర్శిస్తున్న నాగచైతన్య పోస్టర్‌ని చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) హీరోగా  ఘంటసాల బలరామయ్య (Ghantasala Balaramayya) దర్శకత్వంలో ‘బాలరాజు’ అనే టైటిల్‌తో ఓ చిత్రం చేశారు. ఆ చిత్రంలో నాగేశ్వరరావు బాలరాజుగా, ఎస్. వరలక్ష్మీ సీతగా, అంజలీ దేవి మోహినిగా నటించారు. ఇప్పుడు ‘లాల్ సింగ్ చడ్డా’ చిత్రంలో నాగచైతన్య  ‘బాలరాజు’గా చేస్తుండటంతో.. ఏఎన్నార్ చేసిన ఆ చిత్రాన్ని కూడా చిరు ప్రస్తావించారు.



Updated Date - 2022-07-21T01:11:27+05:30 IST