చిరిగిన చొక్కాతోనే Chiranjeevi తాళి ఎందుకు కట్టారు?

ABN , First Publish Date - 2022-07-15T21:00:02+05:30 IST

తెలుగు ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. హీరోగా అంచలంచెలుగా ఎదిగి మెగాస్టార్ అయ్యారు చిరంజీవి. కింగ్ ఆఫ్ డ్యాన్స్‌గా, బాస్ ఆఫ్ మాస్ గా ఎదిగిన ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలతో, ఎందరికో సాయం చేసిన వ్యక్తిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు.

చిరిగిన చొక్కాతోనే Chiranjeevi తాళి ఎందుకు కట్టారు?

తెలుగు ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. హీరోగా అంచలంచెలుగా ఎదిగి మెగాస్టార్ అయ్యారు చిరంజీవి. కింగ్ ఆఫ్ డ్యాన్స్‌గా, బాస్ ఆఫ్ మాస్ గా ఎదిగిన ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలతో, ఎందరికో సాయం చేసిన వ్యక్తిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీ పెద్దగా కొనసాగుతున్న చిరంజీవి.. తన పెళ్ళి సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆవేంటో తెలిస్తే చాలా తమాషాగా అనిపిస్తుంది. ‘పునాదిరాళ్ళు’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరో అవకాశాన్ని అందుకొని ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో నటుడిగా తొలిసారిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి.. బాపు దర్శకత్వంలో ‘మనవూరి పాండవులు’ చిత్రంలో నటిస్తున్న రోజులవి. ఆ  సినిమాలో చిరంజీవి ఎప్పుడూ సైకిల్ తొక్కుతూ కనిపిస్తారు. అదే సినిమాలో ముఖ్యపాత్రను పోషిస్తున్న అల్లు రామలింగయ్య చిరంజీవిని చూసి ఆ సైకిల్ కుర్రాడెవరో కానీ.. అతడికి మంచి ఫ్యూచరుంది అనుకున్నారట. ఇదే విషయం నిర్మాత జయకృష్ణకి చెప్పారట. అలాగే చిరు గురించి తెలుసుకోమని తనయుడు అరవింద్ కు కూడా చెప్పారట. 


మొదటి సారి ‘పున్నమినాగు’ ప్రివ్యూ థియేటర్‌లో చిరంజీవిని కలిశారట అరవింద్.  దాంతో చెప్పండి సార్ అని చిరంజీవి వినయంగా మాట్లాడారట. నీతో మాట్లాడాలని నాన్నగారు పంపారని అరవింద్ చెప్పారట. ఆ ఇద్దరి మధ్యా మాటలు కలిశాయట. మా సురేఖని నీకిచ్చి పెళ్ళి చేయాలని అనుకుంటున్నాం. నీకిష్టమేనా ? అని అడిగారట అరవింద్. దీంతో చిరంజీవి మొదట ఆశ్చర్యానికి గురై.. ఆ తర్వాత తన అంగీకారాన్ని తెలిపారట. ఆ తర్వాత సురేఖ తన బిల్డింగ్ పైనుంచి చూస్తే చిరంజీవి అద్దెకుండే రూమ్ కనిపించేదట. అలా ఇద్దరి చూపులు కలిశాయట. అయితే ఒకరోజు సురేఖ తండ్రి అల్లూ రామలింగయ్యతో అతడు అంత స్టైల్ గా లేడని చెప్పారట. దీనికి అల్లూ రామలింగయ్య అతడి స్టైల్ మాట ఎలా ఉన్నా.. అతడి యాక్టింగ్ మాత్రం చాలా బాగుందని, ఫ్యూచర్ లో పెద్ద స్టార్ అవుతాడని సమాధానం చెప్పారట.


చిరంజీవి, సురేఖ పెళ్ళి ముహూర్తం రానే వచ్చింది. 1980 ఫిబ్రవరి 20న ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ వార్త అప్పట్లో సెన్సేషన్ అయింది. చిన్న చిన్న పాత్రలు చేసే ఒక వ్యక్తికి అల్లూ రామలింగయ్య తన కూతురినిస్తున్నారని చాలా మంది కామెంట్స్ చేశారట. అయితే ఎక్కడో చిరంజీవిలో స్పార్క్ ఉందని రామలింగయ్య నమ్మకం. పెళ్ళికి అన్నీ రెడీ అయ్యాయి. తీరా పెళ్ళి సమయానికి నటుడు నూతన్ ప్రసాద్ ఒక చిక్కు పెట్టాడట. అదే రోజు నూతన్ ప్రసాద్ తో చిరంజీవికి కొన్ని సీన్స్ ఉన్నాయట. ఆ సినిమా పేరు తాతయ్య ప్రేమలీలలు. ఆ రోజు నూతన్ ప్రసాద్ మిస్ అయ్యాడంటే మళ్ళీ నెల వరకూ దొరకడు. ఈ విషయం చిరంజీవికి చెప్పారట నూతన్ ప్రసాద్. దీంతో చిరంజీవికి ఏం చెయ్యాలో అర్ధం కాలేదట. వెంటనే అల్లు అరవింద్ పరిస్థితి అర్ధం చేసుకొని, షూటింగ్ జరిగే స్పాట్‌కు దగ్గరలోనే పెళ్ళి ఏర్పాట్లు చేశారట. చిరంజీవి ముందుగా వెళ్లి షూటింగ్ పూర్తి చేశారు. షూటింగ్ సమయంలో ఏ చొక్కా అయితే వేసుకున్నారో, అదే చొక్కాతో చిరు పెళ్ళికి వచ్చేశారు. ఆ చొక్కా కాస్త మోచేతి దగ్గర చిరిగి ఉంది. తాళి కట్టే సమయంలో చిరంజీవి పైకి లేవగానే, మరీ చిరిగిన చొక్కా వేసుకున్నారేంటి అనుకున్నారట అందరూ. దీంతో చిరంజీవి చొక్కా చిరిగితే తాళి కట్టలేనా అని డైలాగ్ వేశారట. ఈ విధంగా చిరంజీవి, సురేఖల కళ్యాణం జరిగింది. పెళ్లి తర్వాత దాదాపు పదేళ్ళలో చిరు స్టార్ హీరో అయిపోయారు. మరో పదేళ్ళలో మెగాస్టార్ అయ్యారు. అదీ సంగతి.  

Updated Date - 2022-07-15T21:00:02+05:30 IST