చిరు సినిమా కలెక్షన్లతో.. ‘వేర్ ఈజ్ అమితాబ్?’ అనే ప్రశ్న!

ABN , First Publish Date - 2022-03-05T02:32:30+05:30 IST

మెగాస్టార్ చిరంజీవితో కళాబంధు సుబ్బరామిరెడ్డి నిర్మించిన ఏకైక చిత్రం ‘స్టేట్ రౌడీ’. భానుప్రియ, రాధ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించాలి. అయితే అదే సమయంలో చిరంజీవి, కోదండ రామిరెడ్డి కాంబినేషన్

చిరు సినిమా కలెక్షన్లతో.. ‘వేర్ ఈజ్ అమితాబ్?’ అనే ప్రశ్న!

మెగాస్టార్ చిరంజీవితో కళాబంధు సుబ్బరామిరెడ్డి నిర్మించిన ఏకైక చిత్రం ‘స్టేట్ రౌడీ’. భానుప్రియ, రాధ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించాలి. అయితే అదే సమయంలో చిరంజీవి, కోదండ రామిరెడ్డి కాంబినేషన్ లో కొన్ని సినిమాలు నిర్మాణంలో ఉండడంతో ఆలస్యం అవుతుందని బి. గోపాల్‌ను దర్శకుడిగా ఎన్నుకొన్నారు. 


1989 సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిరంజీవి చిత్రం ఘన విజయం సాధించి, కలెక్షన్ల రికార్డులు తిరగ రాయడంతో.. ఆ వెంటనే వచ్చిన ‘స్టేట్ రౌడీ’ చిత్రాన్ని కొనడానికి నైజాం బయ్యర్లు బ్లాంక్ చెక్కులతో పోటీ పడ్డారు. 1989 ఆగస్ట్ 23న ఈ చిత్రం విడుదలైంది. మొదట సినిమా పోయిందని, అట్టర్ ప్లాప్ అని ప్రచారం జరిగింది. అయితే ఆ టాక్‌కు అతీతంగా కలెక్షన్లు ప్రభంజనం సృష్టించాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో స్టేట్ రౌడీ చిత్రం కోటి రూపాయలు వసూలు చేసి అందర్నీ ఆశ్చర్య పరచింది. ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ నటించిన సినిమాకు కూడా రానంత డబ్బు ఒక తెలుగు హీరో చిత్రానికి ఎలా వచ్చిందనే సందేహం అందరిలో తలెత్తింది. స్టేట్ రౌడీ చిత్రం కలెక్షన్ల వివరాలు ప్రచురించి, వేరీజ్ అమితాబ్? అని ప్రశ్నిస్తూ ముంబై నుంచి వెలువడే ట్రేడ్ గైడ్ ఫిల్మ్ మ్యాగజైన్ ఓ ఆర్టికల్ రాసింది. ఈ ఆర్టికల్ హిందీ చిత్ర ప్రముఖుల్ని ఆశ్చర్యపరిచింది. బాక్సాఫీస్ స్టామినాను అలా ‘స్టేట్ రౌడీ’ చిత్రంతో పెంచారు చిరంజీవి. ఈ చిత్ర ఆడియో వేడుకకు కమల్ హాసన్, శత దినోత్సవానికి రజనీకాంత్ అతిథులుగా హాజరయ్యారు.

-వినాయకరావు



Updated Date - 2022-03-05T02:32:30+05:30 IST