చిరంజీవి హీరోయిన్‌ను మోసం చేసిన బిజినెస్ మ్యాన్

ABN , First Publish Date - 2022-04-01T21:31:19+05:30 IST

బెంగాలీ, తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి పేమ్ సంపాదించుకున్న అందాల భామ రిమ్మి సేన్

చిరంజీవి హీరోయిన్‌ను మోసం చేసిన బిజినెస్ మ్యాన్

బెంగాలీ, తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి పేమ్ సంపాదించుకున్న అందాల భామ రిమ్మి సేన్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘అందరివాడు’ చిత్రంలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. అనంతరం బాలీవుడ్ నుంచి వరుసగా అవకాశాలు వెల్లువెత్తడంతో హిందీ సినిమాల్లో బిజీగా మారిపోయింది. ‘ధూమ్’, ‘హంగామా’, ‘గోల్ మాల్: ఫన్ అన్ లిమిటెడ్’, ‘ధూమ్-2’ చిత్రాల్లో కనిపించి ప్రేక్షకులను అలరించింది. రిమ్మిసేన్‌ను ఓ బిజినెస్ మ్యాన్ మోసం చేశాడు. ఆమె నుంచి కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు. వివరాల్లోకి వెళ్లితే.. 


నటి రిమ్మిసేన్‌కు ముంబైలోని జిమ్‌లో రోణక్ జతిన్ వ్యాస్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతడు ముంబైలో వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడు రిమ్మిసేన్‌ను మాయమాటలతో నమ్మించాడు. ఆమె నుంచి రూ.4.14కోట్లను తీసుకున్నాడు. ఆ డబ్బులకు 40శాతం రిటర్న్స్ ఇస్తానని ఆమెకు వాగ్దానం చేశాడు. ఆమెను నమ్మించడానికి రూ.3.25కోట్లకు సంబంధించిన నకిలీ చెక్కును ఇచ్చాడు. ముందుగా ప్రామిస్ చేసినట్టుగా డబ్బులను చెల్లించడంలో విఫలం కావడంతో ఆమెకు అనుమానం వచ్చింది. అతడిచ్చిన చెక్కును డబ్బులుగా మార్చడానికి రిమ్మిసేన్ ప్రయత్నించింది. ఆ సమయంలోనే జతిన్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందని ఆమెకు తెలిసింది. అతడు రిటర్న్స్ ఇవ్వకపోగా.. తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించడంలో కూడా విఫలమవడంతో.. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Updated Date - 2022-04-01T21:31:19+05:30 IST