Chiranjeevi: కొరటాల శివపై సంచలన వ్యాఖ్యలు..!

ABN , First Publish Date - 2022-09-01T15:37:27+05:30 IST

తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ‘ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో’ (First Day First Show) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పలు

Chiranjeevi: కొరటాల శివపై సంచలన వ్యాఖ్యలు..!

తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ‘ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో’ (First Day First Show) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఇదే సమయంలో దర్శకుడు కొరటాల శివను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన కంటెంట్‌తో సినిమాలు తీస్తే తప్పకుండా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అందుకు నిదర్శనం ‘బింబిసార’, ‘సీతా రామం’, ‘కార్తికేయ 2’ చిత్రాలే. మంచి కంటెంట్‌తో వచ్చిన ఆ సినిమాలు ఇండస్ట్రీకి ఊపిరిపోశాయి.  


మంచి సినిమా ఇస్తే వస్తారు.. లేదంటే రెండో రోజే సినిమా పోతుంది. ఆ బాధితులలో ఈ మధ్యకాలంలో నేను కూడా ఒకడినయ్యాను. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్లు.. ప్రేక్షకులకు ఏది అవసరమనేది గమనించి.. కథల మీద దృష్టి పెట్టాలి. ముందు మీరు ప్రేక్షకుడిగా భావించి.. ఏముందని ఈ సినిమా చూడాలని ప్రశ్నించుకోండి. డేట్స్ క్లాష్ అవుతున్నాయి అని కంగారు కంగారుగా షూటింగ్స్ చేయవద్దు. మీపై ఎందరో ఆధారపడి ఉన్నారని గుర్తుపెట్టుకోండి. కంటెంట్ విషయంలో డైరెక్టర్ అనే వాడు.. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలా చేసిన రోజున ఇండస్ట్రీకి ఎక్కువ శాతం హిట్సే వస్తాయి..’’ అని అన్నారు.


అయితే, ఈ వ్యాఖ్యలు ఆచార్య చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కొరటాల శివ (Koratala Siva)ను ఉద్దేశించే అని అర్థమవుతోంది. ఆచార్య రిలీజై అట్టర్ ఫ్లాప్ అని టాక్ వచ్చాక..అప్పటి వరకు కొరటాలకు ఉన్న సక్సెస్‌లు చూసి మెగా హీరోలు కథ సహా షూటింగ్ సమయంలోనూ వేలు పెట్టారనే కామెంట్స్ వినిపించాయి. కొరటాల రాసుకున్న కథ వేరు..తీసంది వేరు అని చెప్పుకున్నారు. ఆచార్య ఫ్లాప్‌కి కారణం చిరంజీవి, రామ్ చరణ్ అయి ఉంటారని మాట్లాడుకున్న వారు లేకపోలేదు.


కానీ, తాజాగా చేసిన చిరు వ్యాఖ్యలు చూస్తే ఇద్దరు మెగా హీరోలు దొరికారు అని వారి మీద దృష్ఠి పెట్టారు గానీ, కథ, కథనం మీద ఓ సినిమా పోతే ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..ఎన్ని ఇబ్బందులు తలెత్తుతాయనే విషయాలను కొరటాల పట్టించుకోలేదని అర్థమవుతోంది. వాస్తవంగా కొరటాల శివ చరణ్‌తో సినిమా చేయాలనుకున్నారు. కానీ, అదే సమయానికి రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా కోసం చరణ్, తారక్‌లను లాక్ చేసుకోవడంతో ..కొరటాలతో..నీకు అభ్యంతరం లేకపోతే నేను సినిమా చేస్తాను..చరణ్‌ను వదిలేయమని చిరు చెప్పారు. 


దాంతో కొరటాల ఉబ్బితబ్బిబ్బై చరణ్‌తో అయితే ఎప్పుడైనా సినిమా చేయొచ్చు. మెగాస్టార్ అంటే మళ్ళీ ఎప్పుడు ఛాన్స్ వస్తుందో అని..అప్పటికప్పుడు ఆచార్య కథను తయారు చేసుకున్నారు. కథ పూర్తైయ్యాక మళ్ళీ ఇందులో చరణ్ కూడా నటిస్తే బావుంటుందని కొరటాల చిరుతో చెప్పారు. దాంతో రాజమౌళిని ఎలాగోలా ఒప్పించి ఆచార్యలో నటింపజేశారు. అటు ఆర్ఆర్ఆర్ ఒత్తిడి, ఇటు ఆచార్య ఒత్తిడి. చరణ్ డేట్స్ తక్కువగా దొరికాయి. అందుకే, హడావుడిగా ఆచార్య తీశాడు కొరటాల. అలా కాకుండా కొరటాల గనక కథ, కథనం.. ప్రేక్షకులను దృష్ఠిలో పెట్టుకొని ఉంటే మంచి సినిమా వచ్చేదని ఇన్‌డైరెక్ట్‌గా మెగాస్టార్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై కొరటాల ఎలా స్పందిస్తారో చూడాలి. 

Updated Date - 2022-09-01T15:37:27+05:30 IST