ఏపీ సినిమా టికెట్ల ధరల నూతన జీవోపై స్పందించిన చిరు

ABN , First Publish Date - 2022-03-08T02:38:40+05:30 IST

గత కొన్నాళ్లుగా ఏపీలో చలన చిత్ర పరిశ్రమ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆ ఇబ్బందుల కారణంగా భారీ బడ్జెట్ చిత్రాల విడుదల వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి..

ఏపీ సినిమా టికెట్ల ధరల నూతన జీవోపై స్పందించిన చిరు

గత కొన్నాళ్లుగా ఏపీలో చలన చిత్ర పరిశ్రమ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆ ఇబ్బందుల కారణంగా భారీ బడ్జెట్ చిత్రాల విడుదల వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి, ఏపీ సీఎం జగన్‌తో చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌తో ధరలను సవరిస్తూ నూతన జీవోని ఏపీ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ జీవోపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. జీవో జారీ చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పరిశ్రమ తరపున చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. 


‘‘తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా, అటు థియేటర్ల మనుగడను, ప్రజలకి వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని, సినిమా టికెట్ రేట్స్ సవరిస్తూ.. సరికొత్త జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌గారికి పరిశ్రమ తరపున కృతజ్ఞతలు. చిన్న సినిమాకు ఐదవ షో అవకాశం కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం. సంబంధిత మంత్రివర్యులు పేర్ని నానిగారికి, అధికారులకి, కమిటీకి ధన్యవాదాలు..’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.  



Updated Date - 2022-03-08T02:38:40+05:30 IST