రెండు పండగలపై కర్చీఫ్ వేసిన మెగాస్టార్

ABN , First Publish Date - 2022-07-06T19:27:38+05:30 IST

టాలీవుడ్ లో సంక్రాంతి (Sankranthi), దసరా (Dasara) సీజన్స్‌లో విడుదలయ్యే సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగలకి దాదాపు 10 రోజులపైగానే స్కూల్స్, కాలేజీలకు శెలవులిస్తారు.

రెండు పండగలపై కర్చీఫ్ వేసిన మెగాస్టార్

టాలీవుడ్ లో సంక్రాంతి (Sankranthi), దసరా (Dasara) సీజన్స్‌లో విడుదలయ్యే సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగలకి దాదాపు 10 రోజులపైగానే స్కూల్స్, కాలేజీలకు శెలవులిస్తారు. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సీజన్స్‌లో ఎక్కువగా సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాగే మాస్ ఆడియన్స్ కూడా భారీగా థియేటర్స్‌కు క్యూ కడతారు. యావరేజ్ టాక్ తెచ్చుకున్నా ఈ సీజన్ లో బ్లాక్ బస్టర్ కైవసం చేసుకోవచ్చు. అందుకే ఈ పండగలపై నెలరోజుల ముందే కర్చీఫ్ వేసేస్తారు స్టార్ హీరోలు. ఇక వారి సినిమాలు విడుదలైతే.. థియేటర్స్ లోనే పండగ మొదలుపెట్టేస్తారు అభిమానులు. 


మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈసారి రెండు పండుగలపైనా కర్చీఫ్ వేయడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ఇటీవల మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. బాబీ (Bobby) దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ సినిమా చిరు 154వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకుంది. శ్రుతి హాసన్ (Shruthi Haasan) కథానాయికగా నటిస్తుండగా.. దేవీశ్రీ ప్రసాద్ (Devisri Prasad) సంగీతం అందిస్తున్నారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ (Raviteja) కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ముఠామేస్త్రీ (Muthamestri) ని పోలిన మాస్ పాత్రను చిరు మళ్ళీ ఇందులో చేస్తుండడం విశేషం. వాల్తేరు సముద్రతీరం నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.


ఇక ‘వాల్తేరు వీరయ్య’ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చిన కొద్దిరోజులకే చిరంజీవి 153వ చిత్రం ‘గాడ్‌ఫాదర్’ (Godfather) చిత్రం విడుదల కూడా ప్రకటించి షాకిచ్చారు మేకర్స్. ఈ సినిమాను ఈ దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా (Mohanraja) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ (Lucifer) చిత్రానికి అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. నయనతార (Nayanathara), సత్యదేవ్ (Satyadev) ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salmankhan) ప్రత్యేకమైన పాత్ర చేస్తున్నారు. విలన్ గా జగపతిబాబు (Jagapathibabu) నటిస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఇంకా సునీల్ (Sunil) చిరంజీవికి అనుచరుడిగా నటిస్తున్నారు. ఇలా ఒకేసారి రెండు పండుగలకు మెగాస్టార్ రిలీజ్ లాక్ చేసుకొని అభిమానుల్ని ఖుషీ చేశారు. మరి ఈ రెండు పండుగలకు చిరు ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటారో చూడాలి. 

Updated Date - 2022-07-06T19:27:38+05:30 IST