Chiranjeevi: చిత్ర పరిశ్రమ ఇచ్చిన అవకాశమిది!

ABN , First Publish Date - 2022-08-20T04:22:03+05:30 IST

‘‘సినిమా సక్సెస్‌ అయినప్పుడు కంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నప్పుడు కలిగే సంతృప్తి చాలా గొప్పది. దానిని మాటల్లో వర్ణించలేము. ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోతాం. ఒక ఉద్యమంలా బ్లడ్‌ బ్యాంక్‌ స్థాపించడానికి కారణం అదే’’ అని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు.

Chiranjeevi: చిత్ర పరిశ్రమ ఇచ్చిన అవకాశమిది!

‘‘సినిమా సక్సెస్‌ అయినప్పుడు కంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నప్పుడు కలిగే సంతృప్తి చాలా గొప్పది. దానిని మాటల్లో వర్ణించలేము. ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోతాం. ఒక ఉద్యమంలా బ్లడ్‌ బ్యాంక్‌  స్థాపించడానికి కారణం అదే’’ అని మెగాస్టార్‌ చిరంజీవి (Megastar chiranjeevi) అన్నారు. సినీతారలు ఎంతో ఉత్సాహంగా ఆడే క్రికెట్‌ మ్యాచ్‌ ‘సెలబ్రిటీ క్రికెట్‌ కార్నివాల్‌(Celebrity cricket carnival)’ స్టెపెంబర్‌ 24న జరగనుంది. డల్లాస్‌లో జరగబోయే కార్నివాల్‌కు సంబంధించి జెర్సీ, ట్రోఫీని చిరంజీవి పార్క్‌ హయాత్‌ హోటల్లో ఆవిష్కరించారు. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా యుత హీరోలంతా చిరంజీవితో కేక్‌ కట్‌ చేయించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్‌, తమన్‌, తరుణ్‌, ఆదర్శ్‌, ప్రిన్స్‌, ఖయ్యుమ్‌ తదితరులు పాల్గొన్నారు.


చిరంజీవి మాట్లాడతూ ‘‘మనకు ఎంతో ఇచ్చిన ప్రేక్షకులకు తిరిగి ఏమి ఇస్తున్నాం అని ఎదురైన ప్రశ్న నుంచి వచ్చిన ఆలోచనే బ్లడ్‌ బ్యాంక్‌. ఉన్నత విద్యనే అభ్యసించకపోయినా ఈరోజు మేమంతా రూ.లక్షల్లో సంపాదిస్తున్నామంటే చిత్ర పరిశ్రమ ద్వారా ప్రేక్షకులు ఆ అవకాశం ఇచ్చారు. అలాంటి వారికి తిరిగి ఎంతో కొంత ఇవ్వాల్సిన అవసరం, బాధ్యత ఉంది. అవి ఇచ్చి తీరాల్సిందే’’ అని అన్నారు. చిత్రపురి కాలనీలో చిరంజీవి నిర్మించే ఆస్పత్రికి రూ.20 లక్షల చెక్కును సీసీసీ క్రీడాకారులు అందజేశారు. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికైనా సంగీత దర్శకుడు తమన్‌ను చిరంజీవి సత్కరించారు. 


Updated Date - 2022-08-20T04:22:03+05:30 IST