Chiranjeevi: ఇది నిజమేనా..?

ABN , First Publish Date - 2022-08-10T15:02:28+05:30 IST

తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. అదేమిటంటే అక్కినేని హీరోలు నటించే సినిమాను మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని.

Chiranjeevi: ఇది నిజమేనా..?

తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. అదేమిటంటే అక్కినేని హీరోలు నటించే సినిమాను మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ (Amir Khan), కరీనా కపూర్ (Kareena Kapoor) జంటగా, టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Nagachaithanya) కీలక పాత్రలో నటించిన సినిమా లాల్ సింగ్ చడ్డా (Lal Sing Chadda). త్వరలో విడుదల కాబోతున్న ఈ మూవీని తెలుగులో మెగాస్టార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో నాగార్జున (Nagarjuna)-అఖిల్ (Akhil) హీరోలుగా ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నట్టుగా సమాచారం.


చిరంజీవి ప్రధాన పాత్రలో తమిళ దర్శకుడు మోహన్ రాజా గాడ్ ఫాదర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, నయనతార, పూరి జగన్నాథ్, సత్య దేవ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ ఏడాది భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఈ సినిమా సమయంలోనే మోహన్ రాజా ఓ కథను చిరంజీవికి వినిపించారట. ఇందులో నాగార్జున-అఖిల్ నటిస్తే బావుంటుందని మోహన్ రాజా తెలిపారట.


దాంతో ఈ కథ గనక నాగార్జునకి నచ్చి చేస్తాను అంటే నేనే ఈ మూవీకి నిర్మాతగా ఉంటానని దర్శకుడు మోహన్ రాజాతో చిరు చెప్పారట. ఇండస్ట్రీలో మెగాస్టార్-కింగ్ నాగార్జునల మధ్య ఉన్న బాండింగ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ బాండింగ్‌తోనే, అక్కినేని హీరోలు చేస్తే గనక ఆ మల్టీస్టారర్ చిత్రాన్ని చిరు నిర్మించడానికి రెడీ అంటున్నారట. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతుందో లేదో. ఒకవేళ నిజంగా చిరంజీవి నిర్మాతగా నాగ్, అఖిల్ మల్టీస్టారర్ అనౌన్స్ అయితే, ఆ అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పడం చాలా కష్టం.

Updated Date - 2022-08-10T15:02:28+05:30 IST