Chiranjeevi: అలా చేస్తే.. ఎదురుదెబ్బ తప్పదు!

ABN , First Publish Date - 2022-08-10T00:17:40+05:30 IST

‘‘బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ సినిమాల్ని రీమేక్‌ చేేస ప్రయత్నం చేేస్త ఎదురుదెబ్బ తగలడం తప్పదు’’ అని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఆమిర్‌ఖాన్‌ హీరోగా నటించిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ చిత్రానికి తెలుగులో చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

Chiranjeevi: అలా చేస్తే.. ఎదురుదెబ్బ తప్పదు!

‘‘బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ (Amir khan)సినిమాల్ని రీమేక్‌ చేేస ప్రయత్నం చేేస్త ఎదురుదెబ్బ తగలడం తప్పదు’’ అని మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi)అన్నారు. ఆమిర్‌ఖాన్‌ హీరోగా నటించిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal singh chedda)చిత్రానికి తెలుగులో చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 14 ఏళ్ల క్రితమే ఈ సినిమా చేయాలని ఆమిర్‌ అనుకున్నారు. 8 ఏళ్ల క్రితం రీమేక్‌ హక్కులు తీసుకుని ఇప్పుడు సినిమాగా తెరకెక్కించారు. నాగచైతన్య (Naga chaitanya)ఇందులో కీలక పాత్ర పోషించారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమిర్‌, నాగ చైతన్య, చిరంజీవిని నాగార్జున ఇంటర్వ్యూ చేశారు. అందులోని ఆసక్తికర విశేషాలు...


ఆమిర్‌ఖాన్‌ నటించిన చిత్రాల రీమేక్‌ గురించి చిరంజీవి (Chiranjeevi)స్పందించారు. నా విషయంలో ఆమిర్‌ ఖాన్‌ చిత్రాలను రీమేక్‌ చేేస్త ఎదురుదెబ్బ తగలడం తప్పదు. ఆయన సినిమాలను టచ్‌ చేయకుండా ఉండటమే మంచిది. ఓ బలమైన కథలో నటించాలంటే చాలామంది నటులు కాస్త తగ్గుతారు. ఇంత రిస్క్‌ అవసరమా అని ఆలోచిస్తారు. ఆమిర్‌ అలా కాదు. పాత్రకు కావలసినట్లు మారిపోవడానికి ఎంత కష్టమైనా ఆనందంగా తీసుకుంటారు. ఎక్కడా రాజీపడరు. తాను అనుకున్న ఔట్‌పుట్‌ వచ్చేంత వరకూ చేస్తూనే ఉంటారు. 


ఈ కథ విషయానికొస్తే.. దీనికి నా జీవితానికి ఒక లింక్‌ ఉంది. 2019లో నేనూ, సురేఖ జపాన్‌ వెళ్లాం. అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఆమిర్‌ కలిశారు. ఎన్నో విషయాలు చర్చించుకున్నాం. అప్పుడే.. హాలీవుడ్‌ సినిమా ‘ఫారెస్ట్‌ గంప్‌’ రీమేక్‌ హక్కులు తీసుకున్నట్లు తెలిపారు. అలాంట కథకు ఆమిర్‌ మాత్రమే న్యాయం చేయగలరని అనుకున్నా. అనుకున్నట్టుగానే ‘లాల్‌సింగ్‌ చడ్డా’లో తనదైన శైలి నటన చూపించారు. ఇవన్నీ నచ్చే ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించా. 


‘‘ఈ పాత్ర కోసం వర్కవుట్స్‌ చేసి బరువు తగ్గా. అమాయకంతో కూడిన పాత్ర ఇది. ఎక్స్‌ప్రెషన్స్‌కి అధిక ప్రాధాన్యత ఉంటుంది. శారీరకంగానే కాదు మానసికంగా సవాల్‌ విసిరిన పాత్ర ఇది’’ అని ఆమిర్‌ఖాన్‌ చెప్పారు.  (Amir khan)

Updated Date - 2022-08-10T00:17:40+05:30 IST