Chiranjeevi: చిరు, సుస్మిత, శ్రీజ.. ఉత్సాహంలో చిరంజీవి

ABN , First Publish Date - 2022-09-13T00:28:18+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో.. తన మనసులోని మాట చెప్పడానికి, భావాలను పంచుకోవడానికి ఇవి సరైన వేదికలు అన్నట్లుగా

Chiranjeevi: చిరు, సుస్మిత, శ్రీజ.. ఉత్సాహంలో చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో.. తన మనసులోని మాట చెప్పడానికి, భావాలను పంచుకోవడానికి ఇవి సరైన వేదికలు అన్నట్లుగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన అనంతరం ఆయన తెలుగు, ఇంగ్లీష్‌లలో పోస్ట్‌లు చేస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆ తర్వాత ట్వీట్స్‌కి హ్యాష్‌ట్యాగ్స్ ఇవ్వడం కూడా నేర్చుకున్నారు. ఇలా సోషల్ మీడియాలోనూ తన ప్రతాపం చూపుతున్న చిరు (Chiru).. తన దృష్టికి వచ్చిన ప్రతి విషయంపై స్పందిస్తూనే ఉన్నారు. తన ఆప్తులు చనిపోయినప్పుడు.. వారికి నివాళులు అర్పిస్తూ, వారితో తనకున్న అనుబంధాన్ని తెలియజేసే చిరు.. తనకు సంతోషం కలిగించే వార్తలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ.. అభిమానులకు, ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. 


తాజాగా ఆయన తన కొడుకు, కుమార్తెలు కలిసి ఉన్న ఫొటోని షేర్ చేసి.. ఈ ఫొటో తనకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. ‘‘తమ పిల్లలందరూ ఒక దగ్గర ఉల్లాసంగా గడిపితే ఆ తల్లిదండ్రులకు కలిగే ఉత్సాహమే వేరు..’’ అంటూ లవ్ ఎమోజీలతో పాటు ఊటీడైరీస్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ని జత చేశారు. ఈ పోస్ట్‌లోని పిక్‌లో రామ్ చరణ్ (Ram Charan), శ్రీజ (Srija), సుస్మిత (Sushmitha) కలిసి కూర్చుని భోజనం చేస్తున్నారు. వారు సంతోషంగా ఒకే చోట అలా కనిపించే సరికి.. చిరులో ఉత్సాహాం వచ్చేసింది. వెంటనే ఆ పిక్‌ని నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. రామ్ చరణ్ తన సోదరీమణులతో పాటు మేన కోడళ్లు, ఇంకా ఇతర కుటుంబ సభ్యులను తీసుకుని వీకెండ్ టూర్‌కి వెళుతున్నట్లుగా రీసెంట్‌గా కొన్ని ఫొటోలు వైరలైన విషయం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి చేసిన పోస్ట్‌తో వారు వెళ్లింది ఊటీ అని తెలుస్తుంది. ఊటీలో అందరూ ఇలా సరదాగా గడుపుతూ.. భోజనం సమయంలో పక్కనపక్కన కూర్చుని దిగిన ఫొటోని చిరంజీవికి పంపడం.. చిరు వెంటనే దానిని సోషల్ మీడియాలో షేర్ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిరు చేసిన ఈ పోస్ట్‌తో మెగా ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.



Updated Date - 2022-09-13T00:28:18+05:30 IST