Godfather: గాడ్ ఫాదర్ ఓపెనింగ్స్ బాగున్నాయి

ABN , First Publish Date - 2022-10-04T23:57:31+05:30 IST

తెలుగు ప్రజలకు పండగ సంబరాల్లో సినిమా కూడా ఒకటి. అందుకే పండగ రోజు సినిమాలు బాగా డబ్బులు చేసుకుంటాయి. అందులోకి మెగా స్టార్ సినిమా విడుదల అంటే మరి చెప్పక్కర్లేదు, ఆ సందడే వేరబ్బా.

Godfather: గాడ్ ఫాదర్ ఓపెనింగ్స్ బాగున్నాయి

చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన 'గాడ్ ఫాదర్' (Godfather) రేపు అంటే దసరా (Dasara festival) పండగ రోజు విడుదల (Releasing) అవుతోంది. తెలుగు ప్రజలకు పండగ సంబరాల్లో సినిమా కూడా ఒకటి. అందుకే పండగ రోజు సినిమాలు బాగా డబ్బులు చేసుకుంటాయి. అందులోకి మెగా స్టార్ సినిమా విడుదల అంటే మరి చెప్పక్కర్లేదు, ఆ సందడే వేరబ్బా. మోహన్ రాజా (Mohan Raja) దీనికి దర్శకుడు, ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ (RB Chowdhary, NV Prasad) నిర్మాతలు. ఈ సినిమాని ఎవరికీ అమ్మకుండా, నిర్మాతలు డైరెక్ట్ గా విడుదల చేసుకుంటున్నారు. 


నిర్మాత ఎన్ వి ప్రసాద్ కి డిస్ట్రిబ్యూషన్ కూడా ఉండటంతో అతనే ఆంధ్ర లో మొత్తం డైరెక్ట్ గా విడుదల చేస్తున్నాడు. చిరంజీవి 'గాడ్ ఫాదర్' తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 1100 (Screens) స్క్రీన్స్ లో విడుదల అవుతున్నట్టు సమాచారం. ఈ సినిమా బడ్జెట్ సుమారు 90 కోట్లు అయిందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 57 కోట్ల రూపాయలు (57 Crores from digital rights) డిజిటల్ హక్కులు ద్వారా సంపాదించింది. ఇది హిందీ మరియు తెలుగు డిజిటల్ హక్కులు కలిపి ఉన్నాయని సమాచారం. అలాగే ఈ సినిమా హిందీ లో కూడా విడుదల అవుతోంది. ఇందులో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఒక ప్రముఖ పాత్ర పోషించటం తో హిందీ లో కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయని అనుకుంటున్నారు. బుక్ మై షో (Book My Show) లో ఈ సినిమా మంగళవారం సాయంత్రానికి ఒక లక్షా 11 వేలమందికి నచ్చినట్టుగా చూపిస్తోంది. అంటే ఇది చాలా పెద్ద సంఖ్య. దీన్ని బట్టి ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వుండే అవకాశం వుంది. ఇదే  కంటిన్యూ అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్ రావొచ్చు అని కూడా అంచనా. చిరంజీవి, దర్శకుడు మోహన్ రాజా, నిర్మాత ప్రసాద్ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని చాల నమ్మకంగా వున్నారు. 

Updated Date - 2022-10-04T23:57:31+05:30 IST