Chiranjeevi: 'గాడ్‌ ఫాదర్‌' లుక్‌ వచ్చేసింది!

ABN , First Publish Date - 2022-07-05T00:01:06+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా తెరకెక్కిస్తున్న చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. మలయాళ సూపర్‌ హిట్‌ ‘లూసీఫర్‌’కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ చితాన్ర్ని కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సోమవారం చిరు లుక్‌ను, గ్లింప్స్‌ వీడియోను సోషల్‌ మీడియా వేదికగా రామ్‌చరణ్‌ విడుదల చేశారు.

Chiranjeevi: 'గాడ్‌ ఫాదర్‌' లుక్‌ వచ్చేసింది!

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi)కథానాయకుడిగా మోహన్‌రాజా (Mohanraja)తెరకెక్కిస్తున్న చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’(God father first look). మలయాళ సూపర్‌ హిట్‌ ‘లూసీఫర్‌’కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ చితాన్ర్ని కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ  చిత్రం ఫస్ట్‌ లుక్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సోమవారం చిరు లుక్‌ను, గ్లింప్స్‌ వీడియోను సోషల్‌ మీడియా వేదికగా రామ్‌చరణ్‌ విడుదల చేశారు. నల్ల్ల కళ్లద్దాలు ధరించి, వింటేజ్‌ కారులో నుంచి చిరు దిగిన స్టైల్‌ చూస్తుంటే అభిమానులకు పండగలాగే అనిపిస్తుంది. సునీల్‌ కారు డోర్‌ తీయగా పవర్‌ఫుల్‌ లుక్‌తో,  స్టైలిష్‌గా నడుచుకుంటూ వెళ్లడం, హెయిర్‌ స్టైల్‌ అందరినీ ఆకర్షించేలా ఉన్నాయి. తమన్‌ నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రమిది. సల్మాన్‌ఖాన్‌(Salman khan), నయనతార(Nayanatara), సత్యదేవ్‌ కీలక పాత్రధారులు. ఈ ఏడాది దసరాకు సినిమాను  విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆర్‌బి చౌదరి , ఎన్‌వి ప్రసాద్ నిర్మాతలు. కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. (God father releasing on Vijayadasami)








Updated Date - 2022-07-05T00:01:06+05:30 IST