కూతురి కోసం మెగాస్టార్ ఫ్రీ ఆఫర్ ?

ABN , First Publish Date - 2022-04-26T19:53:15+05:30 IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి చెందిన వారసులు, వారసురాళ్ళల్లో దాదాపు అందరూ సినిమా పరిశ్రమకే అంకితమైపోయారు. వారిలో వారసులు హీరోలుగా రాణిస్తుంటే.. వారసురాళ్ళు మాత్రం నిర్మాణ రంగాన్ని ఎంచుకున్నారు. ఆ జాబితాలో నాగబాబు తనయ నిహారిక ముందు వరుసలో ఉంటే.. తర్వాత స్థానంలో చిరు తనయ సుస్మిత నిలిచింది. సుస్మిత నిర్మాతగా తన తొలి ప్రయత్నంగా గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సంతోష్ శోభన్, గౌరీ కృష్ణన్ జంటగా.. ‘శ్రీదేవి శోభన్ బాబు’ అనే మూవీని నిర్మిస్తోంది.

కూతురి కోసం మెగాస్టార్ ఫ్రీ ఆఫర్ ?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి చెందిన వారసులు, వారసురాళ్ళల్లో దాదాపు అందరూ సినిమా పరిశ్రమకే అంకితమైపోయారు. వారిలో వారసులు హీరోలుగా రాణిస్తుంటే.. వారసురాళ్ళు మాత్రం నిర్మాణ రంగాన్ని ఎంచుకున్నారు. ఆ జాబితాలో నాగబాబు తనయ నిహారిక ముందు వరుసలో ఉంటే..  తర్వాత స్థానంలో చిరు తనయ సుస్మిత నిలిచింది. సుస్మిత నిర్మాతగా తన తొలి ప్రయత్నంగా గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సంతోష్ శోభన్, గౌరీ కృష్ణన్ జంటగా.. ‘శ్రీదేవి శోభన్ బాబు’ అనే మూవీని నిర్మిస్తోంది. కామెడీ, ఎమోషన్స్ ప్రధానంగా సాగే ఈ ప్రేమకథా చిత్రానికి ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల చిరంజీవి ‘ఆచార్య’  ప్రీరిలీజ్ వేడుకలో లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. అతి తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. సుస్మితకు తండ్రి చిరంజీవి ఓ బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 


ఒక్క పైసా కూడా పారితోషికం తీసుకోకుండా..  సుస్మిత నిర్మాణంలో తనో సినిమా చేస్తానని చిరు మాటిచ్చారట. కథ, కేస్టింగ్, దర్శకుడు సెట్ అయితే..  చిరంజీవి ఆ ప్రాజెక్ట్ లో నటించడానికి రెడీగా ఉన్నట్టు సమాచారం.  చిరంజీవి సినిమా అంటే.. బడ్జెట్ రూ. 60 నుంచి రూ. 80 కోట్ల వరకూ ఉంటుంది. సుస్మిత ఆ స్థాయిలో బడ్జెట్ పెట్టనవసరం లేకుండా.. ఫ్రీగా ఈ ప్రాజెక్ట్ ను చేస్తున్నట్టు టాక్. చిరు ఒక్కో సినిమాకి రూ. 30 నుంచి 50 కోట్ల వరకూ పారితోషికం అందుకుంటారు. ఈ క్రమంలో చిరు అంతమొత్తాన్ని కూతురు కోసం వదిలేస్తున్నారట. మరి సుస్మిత తండ్రి ఇచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని ఏ స్థాయిలో సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. 

Updated Date - 2022-04-26T19:53:15+05:30 IST