Chiranjeevi tweet viral: క్రియేట్‌ చేసేది ఈ బ్రహ్మ!

ABN , First Publish Date - 2022-10-05T01:50:05+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి చేసిన మరో ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఇటీవల రాజకీయాలకు సంబంధించిన ఆయన చేసిన ఓ ఆడియో ట్వీట్‌ ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే!

Chiranjeevi tweet viral: క్రియేట్‌ చేసేది ఈ బ్రహ్మ!

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi)చేసిన మరో ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఇటీవల రాజకీయాలకు సంబంధించిన ఆయన చేసిన ఓ ఆడియో ట్వీట్‌ (Tweet viral)ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే! అలాగే అనంతపురం ప్రీ రిలీజ్‌ వేడుకలో ఆయన చెప్పిన డైలాగ్‌ కూడా అంతే వైరల్‌ అయింది. తాజాగా ఆయన మరో ఆడియో వదిలారు. ప్రస్తుతం ఇది కూడా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ‘కింగ్‌ అయినా.. కింగ్‌ మేకర్‌ (King maker)అయినా.. క్రియేట్‌ చేసేది బ్రహ్మ.. ఈ బ్రహ్మ(Brahma)’ అంటూ ఓ వాయిస్‌ పోస్ట్‌ చేశారు చిరంజీవి. ఈ డైలాగ్‌ ఇప్పుడు మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. మోహన్‌రాజ్‌ దర్శకత్వం వహించారు. సల్మాన్‌ ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషించారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, హిందీ భాషల్లో బుధవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు వారాల తర్వాత తమిళంలో విడుదల చేయడానికి  సన్నాహాలు చేస్తున్నారు. 




Updated Date - 2022-10-05T01:50:05+05:30 IST